అడివి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకు ఒక క్లాస్ టచ్ ఇచ్చాయి.;

Update: 2026-04-04 11:39 GMT

టాలీవుడ్ లో వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలను తెరపైకి తీసుకు రావడంలో అడివి శేష్ స్టైలే వేరు. ‘క్షణం’ నుంచి ‘మేజర్’ వరకు అతను ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచలేదు. ఇప్పుడు శనీల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ అనే పవర్‌ఫుల్ సినిమాతో రానున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, శేష్ తన బాక్సాఫీస్ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించేలా కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ మొదలవ్వడమే ఒక అందమైన ప్రేమకథతో ప్రారంభమవుతుంది.అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకు ఒక క్లాస్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా “మనం పెళ్లి చేసుకుందామా?” అని మృణాల్ అడగటం, దానికి శేష్ సమాధానం చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. అయితే, ఈ ప్రేమకథ ఒక్కసారిగా క్రైమ్ యాక్షన్ లోకీ షిఫ్ట్అవ్వడం కొత్తగా ఉంది. తన జీవితం తనకు మళ్ళీ కావాలని ఒకరు, డబ్బు కోసం మరొకరు చేసే పోరాటమే ఈ సినిమా అసలు పాయింట్ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.




ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ముఖ్యంగా జైలు సీన్లు, పోలీస్ బస్సు పేలిపోవడం అడివి శేష్ మాస్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. “దుబాయ్ పోయే ముందు ఒక పని ఉండాది”, “అందరూ మహేష్ బాబులు అయిపోదామనే!” లాంటి డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఎమోషన్ ను కూడా సమానంగా నడిపించినట్లు కనిపిస్తోంది. తన కోసం పోరాడే ప్రేమికుడిగా, మిషన్ మీద ఉన్న డెకాయిట్ గా శేష్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా కుదిరింది.

మృణాల్ ఠాకూర్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథలో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి నటులు ఉండటం తో కథలో చాలా డెప్త్ ఉన్నట్లు అర్థమవుతుంది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్ చేస్తూ, థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందనిపిస్తోంది.

ఇక ‘డెకాయిట్’ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో మెట్టు ఎక్కించింది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం అడివి శేష్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. బాలెన్స్డ్ గా ఉన్న ఈ కంటెంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


Full View


Tags:    

Similar News