సంచ‌ల‌న పాత్ర‌ను తిర‌స్క‌రించిన ఆ ముగ్గురు!

ఆ ఇద్దరు ప్రధానంగా తమ కెరీర్ గ్రాఫ్ గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు క్యాస్టింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.;

Update: 2026-04-04 15:30 GMT

బాలీవుడ్ చిత్రం `ధురందర్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. సినిమాలో ప్ర‌తీ పాత్ర ఎంతో గొప్ప‌గా పండింది. ముఖ్యంగా మొద‌టి భాగంలో రెహ‌మాన్ డెకాయిత్ రోల్ ఏ రేంజ్ లో పండిందో తెలిసిందే. పినిమాకే ఆ పాత్ర హైలైట్ గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో రెహమాన్ డకైత్ పాత్ర చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించేందుకు మొదట ముగ్గురు అగ్ర హీరోలను సంప్రదించగా, వారు రకరకాల కారణాలతో ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ముందుగా సౌత్ ఇండియాకు చెందిన ఒక స్టార్ హీరో ఈ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు.

అలాగ‌ని ఆ హీరో పాత్ర‌ను ఎంత మాత్రం త‌క్కువ చేయ‌లేదుట‌. ఆ సంగ‌తి ఆ హీరో ఇలా చెప్పారు `రెహమాన్ పాత్ర చాలా బలంగా ఉంది, అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం నాకున్న ఇమేజ్‌కు, నా ఫ్యాన్ బేస్‌కు ఆ రోల్ సరిపోదు` అని అభిప్రాయపడ్డారట. తన కెరీర్‌లో ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని మరీ అంతటి క్రూరమైన నెగిటివ్ రోల్‌లో కనిపిస్తే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అన్న సందేహంతో ఆయన వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఇద్దరు ప్రముఖ స్టార్లు డ‌కైత్ పాత్ర‌ను రిజెక్ట్ చేశారు.

ఆ ఇద్దరు ప్రధానంగా తమ కెరీర్ గ్రాఫ్ గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు క్యాస్టింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. పూర్తి స్థాయి విలన్ రోల్ పోషిస్తే భవిష్యత్తులో తమకు వచ్చే హీరో పాత్రలపై ప్రభావం పడుతుందని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని వారు భావించారట. బాలీవుడ్‌లో గతంలో కొంతమంది హీరోలు నెగిటివ్ రోల్స్ చేసి సక్సెస్ అయినప్పటికీ ఇంతటి భారీ ప్రాజెక్టులో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదన్నారు. చివ‌రిగా అక్ష‌య్ ఖ‌న్నా వ‌ద్ద‌కు ఆ రోల్ చేర‌డంతో? ఆ పాత్ర ప‌రిపూర్ణం అయింది. ఆయ‌న కోస‌మే ఆరోల్ రాసిన‌ట్లు అనిపించింది. ఆయ‌న త‌ప్ప మ‌రో న‌టుడైతే ఆ పాత్ర‌ను అంత గొప్ప‌గా పండించ‌లేడని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను వదులుకోవడం అంటే అది సదరు హీరోల వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఆ పాత్రకు సరిపోయే మరో పవర్‌ఫుల్ నటుడ్నే దించింది. ఒక పాత్రను తిరస్కరించడానికి కేవలం స్క్రిప్ట్ కారణం కాదని మార్కెట్ లెక్కలు , ఇమేజ్ మేనేజ్‌మెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిణామంతోనూ అంచ‌నా వేయోచ్చు. ఈ పాత్రను తిరస్కరించిన హీరోల గురించి నెటిజన్లు వెయ్యి కోట్ల సినిమాలోని అద్భుతమైన అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News