• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ‌చైతన్య ఇంకా...

నాగ‌చైతన్య ఇంకా బ్ర‌హ్మ‌చారే అంట‌!

By - Tupaki Desk
Update: 2018-07-26 10:52 GMT
సమంత‌తో సుదీర్ఘ‌కాలం ప్రేమాయ‌ణం న‌డిపి ఆ త‌ర్వాత ఆమెని పెళ్లి చేసుకొన్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ లెక్కన చూస్తే  బ్ర‌హ్మ‌చ‌ర్యం నుంచి నాగ‌చైత‌న్య ఎప్పుడో బ‌య‌టికొచ్చేసిన‌ట్టే.  అభిమానులు ఫ్యామిలీమేన్‌ లానే చూస్తున్నారు  చైతూని.  కానీ ఆయ‌న మాత్రం నేనింకా బ్ర‌హ్మ‌చారే - నాలో ఇంకా బ్ర‌హ్మాచారి బ‌తికే ఉన్నాడ‌ని చెబుతున్నాడు. నాగ‌చైత‌న్య మాట‌ని స‌పోర్ట్ చేస్తూ ఆయ‌న భార్య స‌మంత కూడా `నా భ‌ర్త చెప్పింది నిజ‌మే` అంటూ సెల‌విచ్చింది. టాలీవుడ్‌ కి చెందిన అంద‌మైన జంట‌గా గుర్తింపు తెచ్చుకొన్న వీళ్ల స‌ర‌దాల‌కి ట్విట్ట‌ర్ వేదికైంది. నాగ‌చైత‌న్య‌కి వ‌ర‌స‌కి బావ అయిన సుశాంత్ త్వ‌ర‌లోనే `చిల‌సౌ`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ఆ సినిమాకి నాగ‌చైత‌న్య - స‌మంతలు అండ‌గా నిలుస్తున్నారు. ప్ర‌మోషన్స్‌ లో భాగంగా సుశాంత్ ఇటీవ‌ల ఆన్‌ లైన్‌ లో కుర్రాళ్ల‌కి స‌ర‌దాగా ఓ కాంటెస్ట్ పెట్టాడు. పెళ్లిని పోస్ట్‌ పోన్ చేయ‌డం కోసం స‌రైన కార‌ణం చెబితే, అది మాకు న‌చ్చితే మీకు ముందుగానే మా చిల‌సౌ సినిమాని చూపించి - ఆ త‌ర్వాత మంచి పార్టీ కూడా ఇస్తామ‌ని సెలవిచ్చాడు సుశాంత్‌. దీన్ని బ్యాచిల‌ర్ పార్టీ అని సంబోధించాడు సుశాంత్. అది చూసిన నాగ‌చైత‌న్య `నేను లేకుండా పార్టీ చేసుకుంటావా ఏంటి? న‌న్ను మ‌రిచిపోయిన‌ట్టున్నావు. నాలో ఇంకా బ్ర‌హ్మ‌చారి బ‌తికే ఉన్నాడు` అంటూ ట్వీట్ చేశాడు చైతూ. `నువ్వే క‌దా ఈ ఈ పార్టీ ఇచ్చేది. నిన్నెలా మ‌రిచిపోతా. కాక‌పోతే స‌మంత‌కి చెప్పి రా` అంటూ సుశాంత్ బ‌దులిచ్చాడు. అది చూసిన స‌మంత రిప్టై ఇస్తూ నా భ‌ర్త చెప్పింది  నిజ‌మే, త‌ను బ్యాచిల‌రే అంది. ఇదంతా నెటిజ‌న్ల‌కి మంచి వినోదాన్ని పంచింది.
Tags:    
  • Naga Chaitanya 
  • Samantha 
  • Sushant 
  • Telugu News 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS