ఆరడజను థియేటర్లు తప్పించి అన్నీచోట్లా..!
భాగ్యనగరి అంటే ఆషామాషీనా? దాదాపు 800 చదరపు కిలోమీటర్లకు పైనే విస్తీర్ణంతో ఉండే ఈ మహానగరిలో ఉండే థియేటర్లు వందల్లో ఉంటాయి. వాటిల్లో చాలానే సినిమాలు నిత్యం ఆడుతూ ఉంటాయి.
కానీ.. చరిత్రలో మొదటిసారి మహానగరంలోని ఏ థియేటర్‌లో చూసినా ఇప్పుడు బాహుబలి సందడే. గ్రేటర్ పరిధిలోని థియేటర్లు.. మల్లీఫ్లెక్సులతో సహా ఏ థియేటర్‌లో చూసినా బాహుబలి సందడే. పొద్దున్నే వచ్చే పేపర్‌లో ఏ హాల్లో ఏ సినిమా ఆడుతుందో చూసుకునేందుకు ఇచ్చే పేజీ చూస్తే.. ఇంతవరకూ ఎప్పుడూ కనిపించనిది కనిపించే పరిస్థితి.
సదరు పేజీ మొత్తం బాహుబలి సినిమాతోనే నిండిపోయింది. థియేటర్లు మొత్తం బాహుబలితోనే నిండిపోయాయి. బాహుబలి కాకుండా వేరే సినిమాలు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. మొత్తంగా ఐదారు సినిమా థియేటర్లు తప్పించి మిగిలిన అన్నీ హాళ్లలో బాహబలి సినిమా వేస్తున్నారు. సాధారణంగా ఏ వీకెండ్ అయినా అన్నీ థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోవు. కానీ.. మొదటిసారి.. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని థియేటర్లలో బాహుబలి చిత్రాన్ని విడుదల చేయటంతో.. అన్ని థియేటర్లు కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకూ ఎదురు కాలేదు. ఈ అరుదైన రికార్డు మరో బాహుబలి లాంటి చిత్రం వచ్చే వరకూ చెరిగిపోదంతే.