బాహుబలి ఎపిసోడ్ లో అతి పెద్ద తప్పా?

Update: 2015-12-02 07:30 GMT
600 కోట్ల కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించి, టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి. దీన్ని ఈ స్థాయికి చేర్చడంలో దర్శకధీరుడు జక్కన్న వ్యూహాలు అనన్యసామాన్యం. మేకింగ్ వీడియోలు - బర్త్ డే స్పెషల్ టీజర్ లు - కేరక్టర్ పరిచయాలు.. ఇలా ఎన్నో ఎత్తుగడలతో.. బాహుబలిని ఆ స్థాయికి చేర్చాడు జక్కన్న. అంచనాలకు మించిన సక్సెస్ సాధించాడు. కానీ ఇప్పుడు ఓ విషయంలో మాత్రం అతి పెద్ద తప్పు చేస్తున్నాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

బాహుబలిని ఇప్పుడు యూట్యూబ్ లో 4కే వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు - తమిళ్ - మళయాళ వెర్షన్లను హైక్వాలిటీతో అధికారికంగానే యూట్యూబ్ లో అందుబాటులోకి తేనున్నారు. అయితే, ఇది ఫ్రీగా చూసే అవకాశం ఉంటుందో, లేక పెయిడ్ వెర్షనో ఇంకా చెప్పలేం కానీ.. ఇలా యూట్యూబ్ లో పెట్టేయడం కారణంగా.. ఒరిజినల్ ప్రింట్ ను పైరసీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లే అనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి స్థానిక భాషల్లోనే సబ్ టైటిల్స్ లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినా.. ఇవాల్టి రోజున పైరసీదారులకు ఆ మాత్రం సబ్ టైటిల్స్ వేస్కోవడం పెద్ద విషయమేం కాదు. దీనికి తోడు బాహుబలి లాంటి మూవీకి.. డైలాగ్స్ కాదు విజువల్స్ మాత్రమే చాలా ముఖ్యం. మరి ఇప్పుడు జక్కన్న నేరుగా తనే 4కే వెర్షన్ రిలీజ్ చేసేస్తే.. తెల్లారేసరికల్లా ఒరిజినల్ ప్రింట్ పైరసీ అయిపోవడం ఖాయం.

మరి ఇప్పుడు ఈ మూవీని తమ స్థానికి భాషలో రిలీజ్ చేయాలని భావిస్తున్న అనేక భాషల డిస్ట్రిబ్యూటర్స్ కు దెబ్బ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటివరకూ బాహుబలి విషయంలో ఇదే అతి పెద్ద తప్పుగా చెబ్తున్నారు.

Tags:    

Similar News