బాహుబలి ప్రీక్వెల్ షూటింగ్ అయిపోయిందోచ్!

Update: 2019-08-23 07:04 GMT
'బాహుబలి' రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఇంకా కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోలేదు.  అయితే బాహుబలికి కథకు సీక్వెల్ అన్నట్టుగా ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత 'ది రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ వారు 'బాహుబలి బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఒక వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే.  

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ వెబ్ సీరీస్ లో మొత్తం 30 ఎపిసోడ్స్ ఉంటాయని. మొదటి సీజన్లో 9 భాగాలు ఉంటాయి.   మొదటి సీజన్ షూటింగ్ ఇప్పుడు పూర్తయింది.  ఇందులో శివగామి చాలా యంగ్ గా కనిపిస్తుందట.  బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ శివగామి పాత్రలో నటిస్తోంది.  ధీరవనిత అయిన శివగామి  మహిష్మతి సామ్రాజ్యానికి ఎలా మహారాణి అయిందనేది ఈ సీజన్ లో ప్రధానంగా చూపిస్తారని సమాచారం.  రెండు మూడు నెలల్లో ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట.

బాహుబలికి సంబంధించిన ప్రీక్వెల్ కావడంతో ఈ వెబ్ సీరీస్ పై భారీగా ఆసక్తి నెలకొంది.  సినిమా రేంజ్ లో ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.  ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగితే మాత్రం ప్రపంచవాప్తంగా ఈ సీరీస్ భారీ విజయం సాధించడం సులువే.

    

Tags:    

Similar News