బాహుబలి రికార్డ్స్‌ను కన్సిడర్‌ చేస్తారా?

Update: 2015-07-07 17:39 GMT
ఒక పెద్ద సినిమా వస్తోందంటే చాలు.. సదరు సినిమాతో ఉన్న సినిమాలను కంపేర్‌ చేసేసి.. ఎన్ని రికార్డులు కొత్తగా పుట్టుకొచ్చాయి, ఎన్ని పాత రికార్డులు తుడిచి పెట్టుకుపోయాయ్‌ అనే జమాఖర్చుల ఖాతాను తెరుస్తుంటారు తెలుగు సినిమా లవర్స్‌. ఇప్పటివరకు ఇండస్ట్రీ రికార్డ్స్‌, వేరొక రికార్డ్స్‌ అన్నీ పవన్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ మొదలగు హీరోల ఖాతల్లో ఉన్నాయి కాని, ప్రభాస్‌ ఖాతాలో ఒక్కటి కూడా లేదు. ''బాహుబలి''తో ఇప్పుడు ప్రభాస్‌ అవన్నీ తుడిచేస్తాడని ఫ్యాన్స్‌ సవాల్‌ చేస్తున్నారు. కాని ఈ రికార్డ్స్‌ను అసలు రికార్డ్స్‌గా కన్సిడర్‌ చేయొచ్చా?

మామూలు సినిమాలు ఏమైనా కూడా.. రేపొచ్చే శ్రీమంతుడు, చరణ్‌-వైట్ల సినిమా.. ఇలా అన్నీ రికార్డులు కొట్టి హిస్టరీ సృష్టించాలి. కాని బాహుబలి పొజిషన్‌ అలా కాదు. అసలు ఈ సినిమాకు 250 కోట్లు అనేదే రికార్డు బడ్జెట్‌. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ధియేటర్స్‌లోనూ సినిమా రిలీజ్‌ అవుతోందంటే రిలీజ్‌ రోజునే ఓ 18 కోట్ల షేర్‌ రావొచ్చు. ఈ రేంజులో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తే కాని సినిమా బడ్జెట్‌ను రికవర్‌ చేయడం కష్టం. మరి అంత గ్రాండ్‌గా రిలీజవుతున్న సినిమాతో పోల్చి అత్తారింటికి దారేది, మగధీర, దూకుడు వంటి సినిమాల రికార్డులన్నీ కల్లాస్‌ అంటే ఎలా?

ఇక తొలి పార్టుతో రాజమౌళి 125 కోట్ల షేర్‌ వసూలు చేసుకోవాలి. అంటే బాలీవుడ్‌, తమిళ్‌, మలయాళంలో ఓ 40 వస్తే.. తెలుగులో ఓ 85 రావాలి. అసలు టార్గెట్టే రికార్డులన్నీ పగిలిపోయే రేంజులో ఉంటే, ఇక మళ్ళీ రికార్డుల గోల ఎలా వర్తిస్తుంది అనేది సగటు సినిమా అభిమానుల క్వశ్చన్‌. పైగా ఈ సినిమాను మన తెలుగు ఆడియన్స్‌లో తప్పిస్తే ఎక్కడా దీనిని సింగిల్‌ హీరో భుజం మీద నడిచే కమర్షియల్‌ సినిమాగా చూడట్లేదు. సో, ఒకరి ఖాతాలోనే రికార్డుల వెల్లువ అంటే మిగిలిన పెద్ద స్టార్ల అభిమానులు ఒప్పుకోవట్లదు మరి. ఒక వర్గం ఫ్యాన్స్‌ పాడుతున్న పల్లవి ఇలా ఉందండి!!!

Tags:    

Similar News