టొరొంటో, బుసాన్ అవార్డులు కొట్టేస్తాడా?

Update: 2015-09-12 09:32 GMT
బాహుబ‌లి ప్ర‌భంజ‌నం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. 50 రోజులు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుని 100వైపు ప‌రుగులు పెడుతూనే ఉందీ సినిమా. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో అరుదైన రికార్డులు సృష్టించిన సినిమాగా దేశ‌ - విదేశాల్లో పాపుల‌రైంది. దాదాపు 600కోట్ల వ‌సూళ్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది. ఓ ప్రాంతీయ భాషా చిత్రం ఈ స్థాయిలో రికార్డులు తిర‌గ‌రాయ‌డం ప్ర‌పంచ దేశాల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఇదంతా జ‌క్క‌న్న మాయాజాలం.

అయితే ఇప్పుడు ఈ సినిమా అంత‌ర్జాతీయ మార్కెట్ లో అడుగుపెడుతోంది. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టొరెంటో ఫిలింఫెస్టివ‌ల్‌ లో స్ర్కీనింగుకి వెళుతోంది.  కెన‌డాలో జ‌ర‌గ‌నున్న ఈ ఉత్స‌వాల‌కు  బాహుబలి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌ - దేవినేని ప్ర‌సాద్ అటెండ్ అవుతార‌ని  తెలుస్తోంది. బాహుబ‌లి ఓ విజువ‌ల్ వండ‌ర్‌. టెక్నిక‌ల్‌ గా అంత‌ర్జాతీయ స్టాండార్డ్స్‌ ని ట‌చ్ చేసింది. కాబ‌ట్టి ఈ ఫిలింఫెస్టివ‌ల్‌ లో అవార్డులు అందుకోవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది. టొరెంటో ఫిలింఫెస్టివ‌ల్‌ తో పాటు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు వేదిక .. బుసాన్ ఫిలింఫెస్టివ‌ల్‌ లోనూ బాహుబ‌లి పోటీకి వెళుతోంది. అక్టోబ‌ర్‌1 నుంచి ఈ ఉత్స‌వాలు 9రోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 4న బాహుబ‌లి ప్ర‌ద‌ర్శ‌న‌కు వెళుతుంది. వీటిని హాజ‌ర‌వుతున్నాన‌ని రాజ‌మౌళి తెలిపారు.

అలాగే బాహుబ‌లి పోస్ట‌ర్ - ట్రైల‌ర్‌ ని కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్స్‌ లోనూ ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ప‌పంచంలోని అన్ని ఫిలింఫెస్టివ‌ల్స్‌ కి బాహుబ‌లి అర్హ‌త ఉన్న సినిమా. అయితే ఏ పండుగ‌లో అవార్డులు కొట్టేస్తుందో తెలియ‌దింకా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News