• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెరికాలో బాహుబలి...

అమెరికాలో బాహుబలి ప్రకంపనలే

By - Tupaki Desk
Update: 2017-04-30 06:54 GMT
తెలుగు సినిమాలు అమెరికాలో ఫుల్ రన్లో మిలియన్ మార్కును అందుకోవడం గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ కేవలం ఒక్క రోజులో 4.8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రకంపనలు రేపుతోంది. ఇది నిర్మాతలు అతి చేసిన చెబుతున్న లెక్క కాదు. స్వయంగా మూవీ డేటా బేస్ సంస్థ ‘ఐఎండీబీ’నే ఈ లెక్కలు ప్రకటించింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ అన్ని భాషల్లో కలిపి గురువారం ప్రిమియర్స్ తో సహా శుక్రవారం చివరి షోలు అయ్యేసరికి ఏకంగా 4.8 మిలియన్ డాలర్లు వసూలు చేసిందన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. విశేషం ఏంటంటే.. ఈ వీకెండ్లో యుఎస్ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి-2 స్థానం రెండు కావడం విశేషం.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 తర్వాత ఈ వారాంతంలో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘బాహుబలి-2’నే కావడం విశేషం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ‘బాహుబలి-2’ కన్నా మరీ ఎక్కువ వసూళ్లేమీ సాధించలేదు. ఆ సినిమా శుక్రవారం 5.1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. టామ్ హాంక్స్.. ఎమ్మా వాట్సన్ లాంటి ప్రముఖ హాలీవుడ్ తారలు నటించిన సినిమా ‘సర్కిల్’ బాహుబలి-2 కంటే తక్కువగా 3.2 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలు సైతం ‘బాహుబలి-2’ లాగా అమెరికాలో ప్రభంజనం సృష్టించింది లేదు. గత ఏడాది ‘దంగల్’ సినిమాకే అక్కడి జనాలు ఔరా అనుకున్నారు. కానీ దాంతో పోలిస్తే ‘బాహుబలి-2’ భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Baahubali 2 Movie 
  • USA Box Office 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS