• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ కు అవార్డులు...

ఎన్టీఆర్ కు అవార్డులు క్యూ కట్టాయ్

By - Tupaki Desk
Update: 2017-07-01 06:40 GMT
జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ట్రెండ్ మార్చాడు. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాల నుంచి బయటకొచ్చి డిఫరెంట్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. ఇది బాగా వర్కవుటయింది. ఇటు సినిమాలు హిట్టవడంతోపాటు మంచి సినిమాలు చేస్తున్నాడనే పేరొచ్చింది. ముఖ్యంగా గతేడాది వచ్చిన నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండింటిలో తారక్ నటనకు విమర్శకులు ప్రశంసలు సైతం వచ్చాయి. జనతా గ్యారేజ్ సినిమా అతడి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా కావడం విశేషం.

ఈ రెండు సినిమాల్లో నటనతో ఉత్తమ నటుడి అవార్డులన్నీ ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ముందు ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్నాడు. ఆ వెంటనే జీ సినిమా నుంచి బాక్సాఫీస్ కింగ్ పురస్కారం అందుకున్నాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫేర్ అవార్డు కూడా తారక్ నే వరించింది. రీసెంట్ గా స్టార్ట్ చేసిన శంకరాభరణం అవార్డు కూడా అతడికే సొంతమైంది. లేటెస్ట్ గా సైమా ఉత్తమ నటుడి అవార్డు కూడా ఎన్టీఆర్ కే దక్కింది. ఇవన్నీ కొద్ది రోజుల తేడాలోనే అందుకోవడం విశేషం. ఇలా వరసపెట్టి అవార్డులన్నీ వచ్చేస్తుండటంతో అతడి అభిమానులంతా ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.  ఇప్పుడంతా తా‘రాక్’ మేనియా నడుస్తోందంటూ సంబరాలు చేసేసుకుంటున్నారు.

తారక్ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఇలా అవార్డులన్నీ అతడిని వరించాయి. మళ్లీ చాలాకాలం తర్వాత ఈ ఫీట్ రిపీటవుతోంది. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండూ ఎన్టీఆర్ కు బాగా ప్లస్సయ్యాయి. నిర్మాతలకు డబ్బులు.. తనకేమో అవార్డులు.. అభిమానులకు ఆనందం పంచాయి. బేసిగ్గా ఒక నటుడికి కావాల్సింది ఇదే. రాబోయే సినిమాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకుంటే మరిన్ని అవార్డులు అతడిని వెతుక్కుంటూ వెళ్లడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • NTR 
  • Awards 
  • Telugu Film Industry 
  • Telugu NEWs 

Similar News

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

Copyright @2026

Powered by Blink CMS