• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ కి గట్టిదెబ్బె...

బాలీవుడ్ కి గట్టిదెబ్బె తగిలినట్లే

By - Tupaki Desk
Update: 2018-05-07 05:37 GMT
బాలీవుడ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది. నేషనల్ లెవెల్లో విడుదలయ్యే సినిమాలు కాబట్టి అందరు ఆకర్షితులవుతారు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాలీవుడ్ సినిమాలు ఈజీగా 100 కోట్లను దాటేస్తుండడం గత ఐదేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఏడాది మాత్రం అనుకున్నంత రేంజ్ లో ఏ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోలేదు. దాదాపు సగం ఏడాది పూర్తి కావొస్తోంది. రీసెంట్ గా కొన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఏవి ఎంతగా ఆకట్టుకోలేదు.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను శాసిస్తున్న బాలీవుడ్ కి ఈ సారి హాలీవుడ్ సినిమా గట్టి సమాధానమే ఇచ్చింది. అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఈ ఏడాది ఏ సినిమా రాబట్టని ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 6న రిలీజ్ అయిన ఇర్ఫాన్ ఖాన్ - బ్లాక్ మెయిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 18 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జుడ్వా 2 సినిమాతో గత ఏడాది 200 కోట్ల బిజినెస్ చేసిన వరుణ్ ధావన్ ఈ ఏడాది ఫెయిల్ అయ్యాడు. ఏప్రిల్ 20న వచ్చిన అక్టోబర్ సినిమా అంచనాలను తారుమారు చేయడంతో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. కేవలం 42 కోట్ల మార్క్ ను అందుకోవడం గమనార్హం.

ఆ తరువాత వచ్చిన ప్రభుదేవ - మెర్క్యురీ (ఏప్రిల్ 20), అభయ్ డియోల్- నాను కి జాను (ఏప్రిల్ 20) మరియు రాహుల్ భట్.. రిచా చద్దా.. అదితి రావు హైదారి యొక్క దాస్ డేవ్ (ఏప్రిల్ 27) సినిమాలు కోటి రూపాయల ఓపెనింగ్స్ కూడా అందుకోలేదు. అవేంజర్స్: ఇన్ఫినిటీ మాత్రం 30.50 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని టాప్ లో నిలిచింది. ఇక ఈ శనివారం వరకు అందిన లెక్కల ప్రకారం 174.50 కోట్ల వరకు కలెక్షన్స్ అందినట్లు టాక్.

గతంలో వచ్చిన జంగల్ బుక్ 188 కోట్లను అందుకొని ఇండియాలో అత్యదిక వసూళ్లు అందుకున్న హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు అవేంజర్స్:ఇన్ఫినిటీ వార్ దాన్ని మించేలా ఉంది. మరో 25 కోట్లు లాగేస్తే 200 క్లబ్ లో చేరుతుంది.


Tags:    
  • Avengers 3: infinity War Movie 
  • Bollywood 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS