నయన్ బాయ్ ఫ్రెండ్ తప్పు చేశాడేమో
హీరోయిన్ నయనతార ఎప్పుడైతే మనోడిని హగ్ చేసుకొని ఒక సెల్ఫీ తన వాట్సాప్ డిస్ల్పే పిక్చర్ గా పోస్టు చేసిందో.. అప్పుడే ఈవిడ నయా ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ అనే విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఇతగాడు లిరిక్స్ రాసి డైరక్టు చేసిన ఒక సాంగ్.. హార్ట్ టచ్చింగ్ గా ఉందని చెప్పేకంటే.. అమ్మాయిలను డిజప్పాయింట్ చేసిందని చెప్పాలి.
'అవలు కేనా..' అంటూ అనిరుధ్ బాబు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేశాడు. ఈ పాట వీడియోలో విఘ్నేష్ బాబు ఏం తీశాడంటే.. ఒక అమ్మాయి.. తన ప్రియుడు వాలెంటైన్స్ డే నాడు ఏ గిఫ్టు ఇవ్వలేదని అడుగుతుంది. ఒక్కటంటే ఒక్క కానుక కూడా తీసుకురాలేదా అంటూ మారం చేస్తుంది. అయితే ఆ అబ్బాయి నిజంగా ఒక కానుక కొంటే.. దానిని ఒక సెక్యూరిటీ గార్డు ఎత్తుకుపోతాడు. బ్యాక్ స్టోరీలన్నీచాలా ఎమోషనల్ గా ఉన్నప్పటికీ.. అసలు ఆడపిల్లలు గిఫ్టులు ఇవ్వకపోతే ఊరుకోరా అనే మీనింగులో ఆ మాంటేజ్ ఉండటంతో ఇప్పుడు తమిళ నెటిజన్లు గొడవ పెట్టేస్తున్నారు.
నయన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇలాగే మారం చేస్తే.. ఇతగాడికి మన హీరోయిన్ కారు కొనిచ్చిందా అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఆ మధ్యన నయన ఈ విఘ్నేష్ బాబుకి బెంజ్ సి-క్లాస్ కార్ ఒకటి కొనిచ్చిందనేది టాక్. సర్లేండి.. ఏదేమైనా.. విఘ్నేష్ మాంటేజ్ సాంగులో మాత్రం తప్పుందనే అనిపిస్తోంది. ఏమంటావ్ నయన్?
Full View