• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ పిల్ల తో కష్టం, కానీ...

ఈ పిల్ల తో కష్టం, కానీ నాకు చాలా ఇష్టం

By - Tupaki Desk
Update: 2022-01-19 13:14 GMT
విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న సరికొత్త చిత్రం `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తున్నారు విశ్వ‌క్ సేన్‌. `పాగ‌ల్` మూవీ త‌రువాత ఆయ‌న వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ నాలుగు చిత్రాల‌ని లైన్ లో పెట్టారు. అందులో ఒక‌టే `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ కు జోడీగా రుక్సార్ థిల్లాన్, రుతికా నాయ‌క్ న‌టిస్తున్నారు.

విద్యా సాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి ర‌వి కిర‌ణ్ కోల క‌థ అందిస్తున్నారు. ఎస్ వీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో హీరో విశ్వ‌క్ సేన్ వ‌డ్డీ వ్యాపారం చేసే అర్జున్‌ కుమార్ అల్లంగా విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌ కుమార్ అల్లంకు పిల్ల దొరికింది అంటూ రిలీజ్ చేసిన వీడియో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. అంతే కాకుండా ఈ వీడియోలో గోప‌రాజు ర‌మ‌ణ ప‌లికిన సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకున్నాయి.

`దొరికింది.. దొరికింది.. అర్జున్ కుమార్ అల్లం కు పిల్ల దొరికిందోచ్ .. అంటూ విడుద‌లైన వీడియో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా విశ్వ‌క్ సేన్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అనే సంకేతాల్ని అందించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ని మేక‌ర్స్ బుధ‌వారం విడుద‌ల చేశారు. `ఓ ఆడ‌పిల్లా .. న‌వువ్ర్థం కావా.. నా జీవితంతో ఆటాడుతావా... అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

ఈ పాట‌ని అనంత శ్రీ‌రామ్ రాశారు. జ‌య‌కృష్ణ సంగీతం అందించిన ఈ పాట‌ని రామ్ మిర్యాల ఆల‌పించారు. మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విభిన్న‌మైన క‌థ‌తో పెళ్లి కోసం ఎదురుచూసే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో విశ్వ‌క్ సేన్ కొంత బ‌రువు పెరిగారు. అంతే కాకుండా మేకోవ‌ర్ ప‌రంగానూ చాలా కొత్త‌గా క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

లిరిక‌ల్ వీడియోని షేర్ చేసి హీరో విశ్వ‌క్ సేన్ `ఈ పిల్ల తో కష్టం, కానీ నాకు చాలా చాలా ఇష్టం` అని కామెంట్ చేస్తే .. హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ `ఆడపిల్ల అంటే ఆ మాత్రం ఉంటాది మరి` అని కామెంట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.
Full View
Tags:    
  • VishwakSen 
  • AshokaVanamLoArjunaKalyanam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS