• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోషన్ పోస్టర్: కౌబాయ్ గా...

మోషన్ పోస్టర్: కౌబాయ్ గా మహేష్ మేనల్లుడు..!

By - Tupaki Desk
Update: 2021-04-05 15:36 GMT
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 'భలే మంచి రోజు' 'శమంతకమణి' 'దేవదాస్‌' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి 'జుంబారే జుమ్ జుంబారే' రీమిక్స్ సాంగ్ విడుదల చేసి.. తాత ని అశోక్ భలే ఇమిటేట్ చేశాడే అనిపించుకున్నాడు. ఈ క్రమంలో నేడు అశోక్ బర్త్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
 
మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ని విడుదల చేసి, ఇది సూపర్ కూల్ గా ఉందని.. ఆన్ స్క్రీన్ లో నిన్ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. రాకింగ్ ఇయర్ ముందుందని పేర్కొన్నారు. ఈ మోషన్ పోస్టర్ లో గల్లా అశోక్ కౌబాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. గతంలో కృష్ణ - మహేష్ ఇద్దరూ కౌబాయ్ గెటప్ లో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి నటవారసుడు ఒకే పోస్టర్ తో ఇద్దరు సూపర్ స్టార్స్ ని కవర్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఉగాదికి ఈ సినిమా టైటిల్ లాంచ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు - సీనియర్ నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ - గల్లా అరుణకుమారి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు.


Full View

Tags:    
  • Ashok Galla 
  • Happy Birthday Motion Poster 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS