ఖుషి కపూర్ - ఆర్యన్ ఖాన్ జోడీ కి రెడీనా?

Update: 2018-08-29 12:40 GMT
ఎన్నైనా చెప్పండి.. సినీ ప్రముఖుల పిల్లలంటే జనాల్లో క్రేజ్ ఉంటుంది.  అందుకే దాదాపు మన టాలీవుడ్ హీరోలంతా ప్రముఖ సినీ కుటుంబాల నుండి వచ్చినవారే.  బాలీవుడ్ ఇందులో ఏమీ తక్కువ తినలేదు.  

- అమీర్ ఖాన్ వాళ్ళ నాన్నగారు తాహిర్ హుస్సేన్.. ఆయన ఒక బాలీవుడ్ ఫిలిం మేకర్. 

- సల్మాన్ ఖాన్ నాన్నగారు సలీమ్ ఖాన్.. ప్రముఖ బాలీవుడ్ రైటర్. షోలే కు రచన చేసిన సలీమ్-జావేద్ ద్వయంలో ఒకరు.

- సంజయ్ దత్ నాన్నగారు ప్రముఖ హీరో- ఫిలిం మేకర్ - రాజకీయ నాయకుడు అయిన  సునీల్ దత్  

- బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నాన్నగారు రాకేష్ రోషన్.. ఆయన ఒక హీరో ప్లస్ ఫిలిం మేకర్. 

- అజయ్ దేవగణ్ నాన్నగారు వీరు దేవగణ్.. ఫేమస్ బాలీవుడ్ స్టంట్ మాస్టర్ కమ్ డైరెక్టర్.

ఇలా చెప్పుకుంటూ పోతే కపూర్ ఖాన్ దాన్ వారసులు.. ఇతరులు చాలామందే ఉన్నారు లిస్టు టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్దది అవుతుంది.  ఇక ఈ జనరేషన్లో కూడా చాలామంది రెడీ అవుతున్నారు.  రీసెంట్ గా శ్రీదేవి - బోనీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వి 'ధడక్' అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి - బోనీ కపూర్ ల రెండో కూతురు ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం అవుతోందట.  ఈ సినిమాలో హీరో తెలిస్తే ఇది ఎంత క్రేజీ ప్రాజెక్ట్  అనేది మనకు అర్థం అవుతుంది.  ఎవరో అనేది టైటిల్ లోనే ఉంది కదా.. ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ పుత్ర రత్నం!

ఈ సినిమాకు ప్రిపరేషన్స్ సీక్రెట్ గా జరుగుతున్నాయట.  ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తాడట.  ఇక ఈ కరణ్ జోహార్ నెపోటిజం అనే  కాన్సెప్ట్ కు కు పర్మనెంట్ ప్రమోటర్ - బ్రాండ్ అంబాజిడర్ లా ఉన్నాడని మీకనిపిస్తే దానికి ఎవరేమీ చేయలేరు!
Tags:    

Similar News