అల్లు అర్జున్ సినిమాలో ఆర్య.. హిస్టరీ రిపీట్స్..?
అల్లు అర్జున్ ‘ఆర్య’ అనే సినిమాలో నటించాడు.. అల్లు అర్జున్ సినిమాలో హీరో ఆర్య కూడా నటించాడు! వరుడు సినిమాలో విలన్ గా నటించిన తమిళ నటుడు ఆర్య.. మరోసారి బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
స్టయిలిష్ స్టార్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంది. ఇందులో తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. సేతుపతి కూడా ఓకే చెప్పాడు. కానీ.. కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ మ్యాచ్ అవ్వడంతో డేట్స్ అన్ని క్లాష్ అయ్యాయి. దీంతో.. ఈ ప్రాజెక్టు నుంచి సేతుపతి తప్పుకున్నాడు.
మరి, విజయ్ ప్లేస్ లో ఎవర్ని తీసుకోవాలి? అని యూనిట్ తర్జనభర్జనలు పడింది. పలానా వారిని తీసుకోబోతున్నారంటూ అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. విజయ్ సేతుపతి లాంటి నటుడు కావాలి, పైగా తమిళంలో ఫుల్ క్రేజ్ ఉండాలి అంటే.. మరో హీరోనే తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నారట.
అన్ని పరిశీలనలు, వడపోతల తర్వాత.. ఆ పాత్రలో తమిళ హీరో ఆర్యను తీసుకోబోతున్నారని సమాచారం. మరి, అది నిజమా కాదా? అన్నది చూడాలి. కాగా.. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. ఆమె ఓ గిరిజన యువతి పాత్ర పోషిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా కూడా చిందెయ్యనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.