జల్లికట్టుపై స్వామి కాస్త సెన్సిబుల్ గానే..

Update: 2017-01-23 14:20 GMT
ఇప్పటివరకు చాలామంది తమిళ సెలబ్రిటీలు తమకు ''జల్లికట్టు'' కావల్సిందే.. అది మా కల్చర్.. అంటూ డిమాండ్లు చేస్తున్నారే తప్పించి.. అసలు ఈ ఆటలో ఉన్న క్రూరత్వం గురించి మాట్లాడట్లేదు. అందుకే చాలామందికి వీరి డిమాండ్ పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కాని ''ధృవ'' విలన్ అరవింద్ స్వామి మాత్రం.. కాసింత సెన్సిబుల్ డిమాండ్లను అడుగుతూ.. మాంచి ఐడియాలను కూడా సజెస్ట్ చేశాడు.

''నిజానికి ఎటువంటి స్పోర్ట్ లోనైనా కూడా.. ప్రమాదాలు అనేవి ఉంటాయి. అందుకే క్రికెట్ అయినా.. ఫుట్ బాల్ అయినా కూడా.. వాటికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. సేఫ్టీ లేకుండా ఈ ఆటలేమీ ఆడరు. ఇప్పుడు గవర్నమెంటు కూడా జల్లికట్టును నిర్వహించడానికి కొన్ని స్టేడియంలు  పెట్టి.. అక్కడ అన్ని జాగ్రత్తలూ పాటిస్తే ఎటువంటి గొడవలూ ఉండవు. క్రికెట్ ఆడుకున్నట్లే జల్లికట్టుతో ఆడుకుంటాం'' అన్న చందాన మనోడు తన వ్యూ పాయింట్ చెప్పేశాడు.

ఒక రకంగా చూస్తే మనోడి ఐడియాలు ఇంట్రెస్టింగానే ఉన్నప్పటికీ.. నిజానికి క్రికెట్ అనేది ప్రాణం లేని బాల్ తో ఆడితే.. జల్లికట్టును ప్రాణం ఉన్న ఎద్దుతో ఆడతారు. రెండింటికీ చాలా తేడా ఉందిగా సారూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News