'అర్జున్ రెడ్డి' దర్శకుడికి టాలీవుడ్ హీరోలు కనిపించడం లేదా...?
సందీప్ రెడ్డి వంగా.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్. ఒక్క సినిమాతో సినీ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఫస్ట్ సినిమానే బోల్డ్ కంటెంట్ తో తీసి ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు స్టార్ డమ్ ను కూడా సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాని తన అన్న ప్రణయ్ వంగా నిర్మించాడు. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ కూడా ఎలాంటి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడో మనందరికి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. కానీ టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమా కమిట్ అవకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. 'అర్జున్ రెడ్డి' సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ‘కబీర్ సింగ్’ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఆ స్టోరీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈసారి 'అర్జున్ రెడ్డి' కాదు... అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ వంగా. అయితే ఈ సారి కూడా సందీప్ టాలీవుడ్ హీరోలతో కాకుండా బాలీవుడ్ హీరోతోనే తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోతోనో సినిమా ఉంటుందని ఆశపడిన సినీ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త అని చెప్పవచ్చు.
సందీప్ వంగా ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా సందీప్ వంగా సినిమాల కోసం హిందీ నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ఈ నేపథ్యంలో ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్ మరియు సినీ వన్ స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ వంగా మూవీని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వీరితోపాటే సందీప్ వంగా అన్నయ్య ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారట. గతంలో టీ సిరీస్ సంస్థతో సందీప్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని.. దాంతో మళ్లీ సందీప్ టాలీవుడ్‌కే వచ్చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ పుకార్లే అని సందీప్ సినిమా వారితోనే అని స్పష్టమైంది. అంతేకాకుండా ఆ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడట. సందీప్ వంగా లాంటి క్రియేటివ్ డైరెక్టర్ హిందీలో మరో మంచి సినిమా చేస్తే.. ఆయన అక్కడ పెద్ద దర్శకులకు గట్టి పోటీ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా ఈ సినిమాతో బాలీవుడ్ లో తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.