ఫిలింఫేర్ - 2026 మొత్తం అల్లు అర్జున్ వైపే చూసింది ఎందుకు?
సీనియర్ నటీమణులు, నేటితరం తారలు ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ తో ఎంతో సన్నిహితంగా ఆప్యాయంగా కరచాలనం చేస్తూ సన్నిహితంగా మెలిగిన తీరు ఆసక్తిని కలిగించింది.;
అక్కడ మెగాస్టార్ చిరంజీవి లేరు.. సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్.. తళా అజిత్ ఇలాంటి దిగ్గజాలు ఎవరూ లేరు.. అయినా కానీ ఆ వేదికపై ఒక ప్రముఖ తెలుగు హీరో కేంద్రక ఆకర్షణగా మారారు. అతడు మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. భారతదేశంలోని అత్యంత ప్రామిస్సింగ్ పాన్ ఇండియా స్టార్ గా తనను తాను మలుచుకున్న గ్రేట్ స్టార్ అతడు..
సీనియర్ నటీమణులు, నేటితరం తారలు ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ తో ఎంతో సన్నిహితంగా ఆప్యాయంగా కరచాలనం చేస్తూ సన్నిహితంగా మెలిగిన తీరు ఆసక్తిని కలిగించింది.
అయితే అల్లు అర్జున్ కి ఎందుకు అంత క్రేజ్ అంటే... అతడి గ్రౌండ్ టు ఎర్త్ నేచుర్, స్నేహ స్వభావం, అందరితో కలిసిపోయే సున్నిత వ్యక్తిత్వం ప్రతిభను మించి అతడి వైపు అందరినీ ఆకర్షిస్తుంది. నేడు భారతదేశంలో 1000 కోట్ల క్లబ్ ను అధిగమించి ఏకంగా 1800కోట్ల వసూళ్లు సాధించిన ప్రముఖ హీరోగా అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పుష్ప 2 చిత్రంతో ఈ రికార్డ్ బన్నీకి సాధ్యమైంది. కేవలం భారతదేశం నుంచి రూ. 1265 కోట్లు వసూలు చేసిన పుష్ప 2, ప్రపంచవ్యాప్తంగా రూ.1830 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. పుష్ప ఫ్రాంఛైజీలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డ్యాన్స్ హుక్ స్టెప్పులు, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ ఇంటర్నెట్ లో ప్రతిధ్వనిస్తున్నాయి .. అంటే అవి ప్రజలకు ఏ రేంజులో కనెక్ట్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
అందుకే 2026 ఫిబ్రవరి 21న కేరళ వేదికగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేంద్రక ఆకర్షణగా నిలిచాడు. 2024-25 సీజన్ లో పుష్ప 2 అత్యుత్తమ వసూళ్ల చిత్రంగా రికార్డులకెక్కింది. అందుకే ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో `పుష్ప 2: ది రూల్` పలు పురస్కారాలను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సినిమాకి ఏకంగా 4 అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం-పుష్ప2, ఉత్తమ నటుడు- అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడు - సుకుమార్,.. అంటూ వేదికపై ప్రకటిస్తుంటే ఆ సౌండ్ అన్నిచోట్లా ప్రతిధ్వనించింది.
పుష్పరాజ్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించినందుకు గాను బన్నీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. కేవలం నటనకే కాకుండా.. ఈ చిత్రం ఉత్తమ సినిమాగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు గెలుచుకోవడంతో స్టేజ్ మొత్తం `పుష్ప` మయమైపోయింది.
రజనీకాంత్, విజయ్ వంటి దిగ్గజాలు ఈ వేడుకకు హాజరుకాకపోవచ్చు.. టాలీవుడ్ దిగ్గజ హీరోలు ఈ వేదికపై కనిపించకపోవచ్చు.. కానీ అల్లు అర్జున్ ఒక్కడు చాలు! అని ప్రూవ్ అయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన పాన్ ఇండియా క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ వైపే అందరి చూపు మళ్లింది. కేరళలో బన్నీకి ఉన్న `మల్లు అర్జున్` ఇమేజ్ ముందు మాలీవుడ్ హీరోలు కూడా తేలిపోయారు. ఐకాన్ స్టార్ కి ఆ స్థాయిలో నీరాజనాలు అందాయి.
సర్వాంగ సుందరంగా గ్లామర్ అద్దుకున్న ఈ వేదికకు అల్లు స్టార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్ తన సిగ్నేచర్ స్టైల్‌తో రెడ్ కార్పెట్ ఆద్యంతం మెరుపులు మెరిపించారు. అతడు బ్లాక్ ఎన్‌సెంబుల్ ధరించి తనదైన స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చి ఫోటోగ్రాఫర్లకు, ఫ్యాషన్ విశ్లేషకులలో హాట్ టాపిక్ అయ్యారు.
తోటి నటీనటులతో సాన్నిహిత్యం:
బన్నీ తన విజయాలను ఆస్వాధిస్తూనే సహనటీనటులతో ఎంతో వినయంగా, స్నేహపూర్వకంగా మెలిగారు. సీనియర్ హీరోయిన్లు..ఇప్పటి తరం నటులు ఆయనతో ముచ్చటించడం, సెల్ఫీలు దిగడం చూస్తుంటే ఇండస్ట్రీలో అతడికి ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది.
మొత్తానికి `తగ్గేదే లే` అంటూ అల్లు అర్జున్ 2026 ఫిల్మ్‌ఫేర్ వేదికను తన సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్- ఫాంటసీ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో మరో హాలీవుడ్ సినిమాని తలపిస్తుందని అంచనా వేస్తున్నారు. బహుశా మరోసారి ఫిలింఫేర్ పురస్కారాలలో, జాతీయ అవార్డుల వేదికపైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపించడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.