నువ్వు తీసిందో ప్లాప్ సినిమా అని భయపెట్టిన పెట్టిన సీనియర్
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి.
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి క్లాసిక్ చిత్రాలలో బాలీవుడ్ చిత్రం `మున్నాభాయ్ ఎంబీ బీఎస్` ఒకటి. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ప్రతిభకు నిదర్శనమైన చిత్రమిది. కామెడీ, ఎమోషన్ కలయికతో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రమిది.
అయితే ఈ రోజు సినిమా విడుదల కాకముందు ఎదుర్కొన్న అపనమ్మకాలు.. విమర్శల గురించి తాజాగా రాజ్ కుమార్ తొలిసారి ఓపెన్ అయ్యారు. ఈ సినిమా తర్వాత హిరాణీ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినా? ఏనాడు ఆ పాత సంఘటన గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసే ఏ దర్శకుడికైనా తన మొదటి సినిమాపై ఎన్నో ఆశలు..మరెన్నో భయా లుంటాయి. రాజ్‌కుమార్ హిరాణీకి కూడా `మున్నాభాయ్ ఎంబీబీఎస్` మొదటి చిత్రం కావడంతో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ సమయంలో పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమా ప్రివ్యూను చూసి ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూస్తుందని ముఖం మీదే తేల్చి చెప్పినట్లు హిరాణీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. హిరాణీ తొలి సినిమాకే అలాంటి విమర్శ రావడంతో ఆయన డిపెన్స్ లో పడ్డారు.
నిజంగా సినిమా ఫెయిలవుతుందా? అన్న భయం ఆయన్ని వెంటాడింది. అయితే ఆనాటి ముందస్తు విమర్శకు ప్రధాన కారణం సంజయ్ దత్ ఇమేజ్. అప్పటి వరకు యాక్షన్ హీరోగా, గ్యాంగ్‌స్టర్ పాత్రలలో రఫ్ అండ్ టఫ్ లుక్‌తో అలరించిన సంజయ్ దత్ సాఫ్ట్ ఎమోషనల్ కామెడీ రోల్‌లో డాక్టర్ కోటు వేసుకుని కనిపించడం కొందరికి మింగుడుపడలేదు. ఒక భయంకరమైన రౌడీ మెడికల్ కాలేజీకి వెళ్లి చదువుకోవడం జాదూ కీ జప్పీ ద్వారా రోగులను నయం చేయడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాదని ఆ దర్శకుడు భావించాడు. కానీ రాజ్‌కుమార్ హిరాణీ తన కథపై, సంజయ్ దత్ నటనపై పూర్తి నమ్మకంతో ముందడుగు వేశారు.
సినిమాలో సంజయ్ దత్ పాత్ర మాత్రమే కాకుండా.. అతనికి కుడిభుజంగా నటించిన అర్షద్ వార్సీ (సర్క్యూట్ పాత్ర) కూడా సినిమా విజయానికి ప్రధాన మూలస్తంభంగా నిలిచింది. మున్నా-సర్క్యూట్ ల మధ్య ఉన్న స్నేహం, వారి టైమింగ్ హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత ఐకానిక్ జోడీలలో ఒకటిగా నిలిచిపోయింది. విమర్శకులు సినిమా ఫెయిల్ అవుతుందని భావించిన వేళ, ఇద్దరు నటుల మధ్య ఉన్న అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడమే కాకుండా ప్రేక్షకులను లోతైన భావోద్వేగానికి గురిచేసింది.
సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద జరిగిన అద్భుతం అందరినీ ఆశ్చర్యపరిచింది. నెగెటివ్ రివ్యూలను, అంచనాలను తలకిందులు చేస్తూ `మున్నాభాయ్ ఎంబీ బీఎస్ భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఒక సినిమా విజయాన్ని కేవలం ముందస్తు సూత్రాల ఆధారంగా లేదా పాత ఇమేజ్ ఆధారంగా అంచనా వేయలేమని ఈ చిత్రం నిరూపించింది. సినిమాలోని మానవీయ విలువలు, ఎమోషన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయో బాక్సాఫీస్ వసూళ్లే సమాధానం చెప్పాయి.