ఫోటో స్టొరీ: అరియానా Vs ప్రియాంక

Update: 2018-11-09 13:22 GMT
ఒకే స్టైల్ డ్రెస్ ఇద్దరు వేసుకుంటే ఒకేలా ఉంటుందా? కొన్ని డ్రెస్ లు కొందరికి సెట్ అవ్వవు. కొన్నేమో కొందరికే సెట్ అవుతాయి. ఇక సెలబ్రిటీల గురించి.. అందులోనూ ఫ్యాషన్ ఐకాన్ ల గురించి మాట్లాడుకుంటే సిమిలర్ డ్రెస్సులు వేసుకుంటే పోలికలు తప్పవు. తాజాగా గ్లోబల్ సుందరి ప్రియాంక.. పాప్ సింగర్ అరియానా గ్రాండ్ ల డ్రెస్ గురించి అలాంటి  పోలికే వచ్చింది.

కొన్ని రోజుల క్రితం ప్రియాంక రెండు ఫ్రంట్ స్లిట్స్ ఉండే గ్రే కలర్ డియోన్ లీ బ్లేజర్ తో తళుక్కున మెరిసింది.  అప్పట్లో ఆ డ్రెస్ గ్లోబల్ గా హాట్ టాపిక్ అయింది.  తాజాగా అలాంటి డ్రెస్సే గానీ కాస్త తేడా ఉన్న గ్రే కలర్ డియోన్ లీ బ్లేజర్ ను అరియానా వేసుకుంది.  'బ్రీతిన్' పేరుతో రిలీజ్ అయిన తన సాంగ్ వీడియోలో అరియానా ఈ డ్రెస్ ధరించింది. ఇంకేముంది..  వెంటనే పీసీ కి పాప్ సింగర్ కి పోలికలు మొదలయ్యాయి. ఎవరు ఆ డ్రెస్ ను గ్రేస్ తో స్టైల్ గా ధరించారు.. ఇద్దరిలో ఎవరు గొప్ప.. ఇవీ ఫ్యాషన్ ప్రియుల చర్చలు.

ఓవరాల్ గా అందరి వోటు ప్రియాంక చోప్రాకే పడింది. ఎందుకంటే స్లిట్స్ ను డేర్ గా అలా వదిలేయడం.. ఆ కాన్ఫిడెన్స్.. అన్నిటిలో ప్రియాంక ఆరియనాను దాటేసింది. మన ఇండియన్ బ్యూటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ను ఫ్యాషన్ విషయంలో ఓడించడం అంటే మాటలు కాదుగా? అందుకేనేమో బాలీవుడ్ బ్యూటీ అనకుండా ఈమధ్య అందరూ పీసీని గ్లోబల్ సుందరి అని పిలుస్తున్నారు!
Tags:    

Similar News