‘బుక్ మై షో’లో సినిమాలేమున్నాయ్?
ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లకు మోక్షం కలగబోతోంది. దేశవ్యాప్తంగా ఇంకో రెండు రోజుల్లో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ప్రభుత్వం అనుమతులిచ్చింది కానీ.. ప్రదర్శించడానికి సినిమాలు ఎక్కడ అన్నది థియేటర్ల యాజమాన్యాల ప్రశ్న. 50 శాతం ఆక్యుపెన్సీ, కరోనా షరతుల మధ్య సినిమాలు ఏమాత్రం నడుస్తాయన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. అందుకు తగ్గట్లే కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలెవ్వరూ ముందుకు రాలేదు. మరి థియేటర్లు తెరుచుకుని ఏం ప్రయోజనం.. ఇంతకీ వాటిలో ఏం ప్రదర్శిస్తారు అన్న అయోమయం కొనసాగుతోంది. సినీ ప్రియులు మామూలుగా టికెట్ల బుకింగ్ కోసం ఉపయోగించే ‘బుక్ మై షో’ యాప్ సంగతే తీసుకుంటే.. అందులో అసలు బుకింగ్ ఆప్షనే కనిపించడం లేదు.
ఒకప్పుడు సినీ ప్రియులు విపరీతంగా వాడే యాప్ అయిన ‘బుక్ మై షో’ను గత ఏడు నెలల్లో ఒక్కసారీ ఓపెన్ చేయాల్సిన అవసరమే పడలేదు. థియేటర్లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అందులో కొత్త సినిమాల గురించి ఏమైనా అప్‌డేట్స్ ఉన్నాయేమో అని ఓపెన్ చేసి చూస్తే అంతా ఖాళీగానే ఉంది. కమింగ్ సూన్ అంటూ ఏవో సినిమాలు పెట్టారు కానీ.. ప్రస్తుతం నడుస్తున్న సినిమాల కేటగిరీలోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు. థియేటర్లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏవైనా ఇంగ్లిష్ సినిమాలను ప్రదర్శిస్తారేమో.. వాటికి బుకింగ్స్ ఓపెన్ చేశారేమో అని చూస్తే అలాంటి సంకేతాలే లేవు. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా కొత్త సినిమాలు ఏవీ రిలీజయ్యే అవకాశం లేదని.. థియేటర్ల దుమ్ము దులిపి ముస్తాబు చేయడం తప్పితే సినిమాల ప్రదర్శన ఉండదని స్పష్టమవుతోంది. కాబట్టి 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు మామూలుగా నడిస్తే తప్ప కొత్త చిత్రాల విడుదల ఉండదని స్పష్టమవుతోంది.