చిరు చరణ్‌ ఆస్థి వివాదం కాదన్న కొరటాల

Update: 2020-06-15 07:10 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో చరణ్‌ నటించబోతున్న విషయం తెల్సిందే. ఆచార్య చిత్రంలో చరణ్‌ పాత్ర గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. రామ్‌ చరణ్‌ చిరంజీవిల కాంబో సీన్స్‌ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో వీరిద్దరి కాంబో సీన్స్‌ ను దర్శకుడు కొరటాల ప్లాన్‌ చేశాడని ఆ సీన్స్‌ సినిమాలో కీలకంగా ఉంటాయనే పుకార్లు జోరుగా వస్తున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ స్పందించాడు.

మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కొరటాల పేర్కొన్నాడు. చిరుకు హెల్ప్‌ చేసే పాత్రలో చరణ్‌ కనిపించబోతున్నాడని.. ఇంకా చరణ్‌ పాత్రకు సంబంధించి పూర్తి సీన్స్‌ ను కూడా రెడీ చేయలేదని చరణ్‌ కూడా తన సీన్స్‌ ను వినలేదని ఆచార్య టీం మెంబర్స్‌ కొందరు చెబుతున్నారు. ఆచార్య సినిమాలో చరణ్‌ పాత్రకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండానే ఇలాంటి పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆచార్య టీం మెంబర్స్‌ అంటున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్‌ నటించబోతుంది. రామ్‌ చరణ్‌ పాత్రకు కూడా ఒక హీరోయిన్‌ ఉంటుందట. ఆమె ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రాన్ని అన్ని సవ్యంగా ఉంటే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వారు. కాని వైరస్‌ మహమ్మారి కారణంగా వచ్చే ఏడాది వరకు ఈ సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News