రెహ్మాన్ చెల్లెలి కొత్త అవతారం

Update: 2017-05-03 10:25 GMT
సినిమా ఇండస్ట్రి లో చాలా కామన్ గా జరిగే బంధు వర్గం ఎంట్రీ కి ఇది మరో ఉదాహరణ. ఒక గొప్ప సంగీత ధర్శకుడు సోదరి ఇప్పుడు తమిళ్  సినిమాలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఆవిడే ఏ ఆర్‌ రహ్మాన్ సోదరి ఏ ఆర్ రెహానా. ప్లే బ్యాక్ సింగర్ గా తమిళ్ సినిమాకు పరిచయమైన ఈవిడ ఇప్పుడు ‘ఎన్డ తలైల ఎన్నై వెక్కల’ అనే సినిమా తో నిర్మాతగా మారనుంది.

నిజానికి రెహ్మాన్ ఒక ప్రక్కన లెజండరీ మ్యూజిక్ డైరక్టర్ అయినప్పటికీ.. రెహానా మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. సింగర్ గా కాస్త లిమిటెడ్ అయిపోయిందీవిడ. అయితే ఇప్పుడు సడన్ గా ఆటూ ఇటూ కాస్త సంపాదించి దాచుకుంది అంతా పెట్టేసి.. ''యోగి అండ్‌ పార్టనర్స్‌'' బ్యానర్‌ పై ఈ సినిమాను నిర్మించారు. మొత్తానికి నిర్మాణం చేపట్టేశారు కాని.. ఇటువంటి ప్రాజెక్టులు అందరికీ కలసిరాలేదు. స్వయంగా రెహ్మాన్ నిర్మించిన కొన్ని సినిమాలు కూడా అడ్రస్ లేకుండా గల్లంతయిపోయాయ్. మరి రెహానా ఎందుకు ఈ ఫీట్ చేసిందో. ఈ కొత్త అవతారం ఎందుకు ఎత్తిందో.

ఈ సినిమాలో కొత్త నటుడు అజార్‌.. సుచిలీక్స్ ఫేం సంచితాశెట్టి హీరో హీరోయిన్లు. హాస్యనటుడు యోగిబాబు ముఖ్యపాత్ర లో కనబడనున్నారు.  ఈ సినిమా ఆడియోను ప్రముఖ దర్శకుడు నటుడు భాగ్యరాజ్‌  విడుదల చేశారు. మండు వేసవి లో హాయి గా నువ్వు కొనే సినిమా ఇది. మొత్తం ఫ్యామిలి అంతా కలిసి చూడదగ్గ చిత్రం ఇది అని నిర్మాత రెహానా చెప్పారు. చూద్దాం రెహ్మాన్ సోదరి ప్రయాణం ఎలా ఉండబోతోందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News