పిక్ టాక్: వైరల్ అవుతున్న టాలీవుడ్ అందాల అప్సరస..!

Update: 2021-06-25 00:30 GMT
తెలుగు కుర్రకారుకి అందమైన కుర్రభామలను ఎలా హైలైట్ చేయాలో బాగా తెలుసు. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అందగత్తె దిగినా ఇట్టే ఆమె అందం సోషల్ మీడియాలో మోసేస్తుంటారు. అయితే కొందరు హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో క్రేజ్ కోసం ఎంత స్ట్రగుల్ అవుతారో.. సరైన డైరెక్టర్ తగిలితే మాత్రం క్రేజ్ తో ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాగని అందరికి అన్ని కలిసి రావు. ఏవి వారి క్రేజ్ కు ఉపయోగపడతాయో వాటినే ఎరగా వేస్తూ ఫేమ్ అవుతుంటారు. అలా సినిమాల పరంగా క్రేజ్ లేకపోయినా తన మేని అందాలను నమ్ముకొని ఫేమ్ లోకి వచ్చింది హాట్ బ్యూటీ అప్సరరాణి.

ఈ పాతికేళ్ల ఉత్తరాఖండ్ బ్యూటీ.. చిన్నప్పటి నుండే సినిమాలు యాక్టింగ్ పై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చింది. బెలగాంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అమ్మడు ఆ వెంటనే మోడలింగ్ వైపు అడుగులేసింది. ఆ తర్వాత నేరుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే 2019లో 4లెటర్స్ అనే రొమాంటిక్ మూవీతో అరంగేట్రం చేసిన అప్సర.. మొదటి సినిమాలోనే బికినీ వేసి ఓ రేంజిలో అల్లాడించింది. ఆ తర్వాత 'ఉల్లాలా ఉల్లాలా' అనే మరో రొమాంటిక్ మూవీ చేసింది. ఆ సినిమాలో కూడా బికినీ వేసి లిప్ లాక్ సన్నివేశాలలో అదరగొట్టింది.

అయితే మొదటి నుండి అమ్మడు స్కిన్ షో.. రొమాన్స్ పరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అందుకే సినిమాల్లో ఎలాంటి రోల్ ఇచ్చినా ఇలా రెడీ అంటోంది. గతేడాది వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతిలో పడింది. ఒక్కసారిగా వర్మ వయ్యారిని అందంగా పిక్చర్స్ తీసి పాపులర్ చేసేసాడు. అలాగే తన సినిమాల్లో కూడా అవకాశాలు ఇస్తున్నాడు. వర్మ కారణంగానే అప్సర ప్రస్తుతం ఫుల్ క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇక స్పెషల్ సాంగ్స్ విషయానికి వస్తే అప్సర నిజంగానే అప్సరస అనిపించుకుంటుంది. క్రాక్ సినిమాతో బూమ్ బద్దలు చేసిన బ్యూటీ.. సీటిమార్ లో కూడా ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న లెస్బియన్ మూవీలో నటిస్తుంది.

అయితే అప్సరకు సంబంధించి సోషల్ మీడియాలో లేటెస్ట్ గ్లామరస్ స్టిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. అమ్మడు చీరకట్టు నుండి టు-పీస్ బికినీ వరకు ఎలాంటి కాస్ట్యూమ్ లో అయినా కుర్రాళ్లలో వేడి పుట్టించగలదు. ప్రస్తుతం అప్సరను టాలీవుడ్ అప్సరసలా భావిస్తున్నారు సినీప్రేక్షకులు. ఈ వయ్యారి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News