• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెట్రోల్ అమ్మిన బ్యూటీ...

పెట్రోల్ అమ్మిన బ్యూటీ స్వీటీ

By - Tupaki Desk
Update: 2018-02-04 08:25 GMT
సినిమా తారలకు పాపులారిటీ ఎంత ఉంటుందో వాళ్ళను సరిగా వాడుకోవాలే కాని మంచి పనులకు కూడా అంతే ఉపయోగపడతారు అని మంచు లక్ష్మి తన నేను సైతం ప్రోగ్రాం ద్వారా గతంలోనే ఋజువు చేసింది. అవసరం ఉన్న దీనులకు, పేదలకు ఆర్థిక సహాయంతో పాటు మానసిక స్థయిర్యాన్ని నింపే ఈ ప్రయత్నానికి దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరిని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసిన మంచు డాటర్ ఇప్పుడు దీనికి సెకండ్ సీజన్ షూటింగ్ కూడా మొదలు పెట్టేసింది. అందులో భాగంగా భాగమతి అనుష్కను రంగంలోకి దించేసింది. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 1లో ఉన్న పెట్రోల్ పంపు వద్ద అనుష్క స్వయంగా యునిఫార్మ్ వేసుకుని పంపుతో పెట్రోల్ కొడుతూ ఫుల్ హంగామా చేసింది. అనుష్క వస్తుంది అన్న విషయం నిన్నే సదరు బంకు యాజమాన్యం ప్రకటించడంతో అవసరం ఉన్నా లేకున్నా స్వీటీ కోసం ఫాన్స్ క్యూ కట్టేశారు.

ఇది త్వరలోనే టెలికాస్ట్ కానుంది. మంచి పని కాబట్టి ఆలోచించలేదని, అదే పనిగా చేయాలంటే ఇలాంటివి చేయలేమని, అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదని చెప్పిన అనుష్క మంచు లక్ష్మి అడిగిన వెంటనే ఓకే చెప్పిందట. భాగమతి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అనుష్క వస్తున్న వసూళ్ళ పట్ల ఫుల్ హ్యాపీ గా ఉంది. మంచు లక్ష్మి ప్రోగ్రాం ద్వారా పబ్లిసిటీ కన్నా ఒక మంచి ఉద్దేశాన్ని నెరవేర్చుకున్న అనుష్క ఇలాంటి వాటికి తాను ఎప్పుడూ రెడీ అంటోంది. షూటింగ్ స్టార్ట్ చేసుకున్న నేను సైతం 2లో గతంలో కంటే ఇంకా పేరున్న సెలేబ్రిటీలు రాబోతున్నారట. జెమినీ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంకి రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి.  యాంకర్ గా మళ్ళి బిజీ అవుతున్న మంచు లక్ష్మి సినిమాల కంటే టీవీకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉందట
Tags:    
  • Anushka Shetty 
  • Petrol Bunk 

Similar News

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

Copyright @2026

Powered by Blink CMS