కావాలని తీసుకున్నది కాదు : అనుష్క

Update: 2020-09-30 11:10 GMT
బాహుబలి సినిమా తర్వాత అనుష్కకు ఆల్‌ ఇండియా స్టార్‌ డం దక్కింది. బాలీవుడ్‌ లో సైతం అనుష్క నటించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె బాహుబలి తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని భాగమతి సినిమాను చేసింది. ఆ సినిమా తర్వాత ఏకంగా రెండున్న ఏళ్ల గ్యాప్‌ లో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ పడ్డప్పుడు వెంటనే బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అయ్యి క్యాష్‌ చేసుకోవాలి. కాని అనుష్క మాత్రం అలా చేయలేదు. ఆమె సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటుంది. త్వరలో విడుదల కాబోతున్న నిశబ్దం సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ గ్యాప్‌ పై స్పందించింది.

భాగమతి సినిమా తర్వాత నేను గ్యాప్‌ తీసుకోవాలనుకోలేదు. కాని అది కొన్ని కారణాల వల్ల వచ్చింది. నిశబ్దం సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమాను చేయాలని భావించాను. కాని నిశబ్దం ఆలస్యం అవ్వడం వల్ల కొత్త సినిమాను మొదలు పెట్టలేక పోయాను. గత సమ్మర్‌ లో కొత్త సినిమాను చేసి ఇదే ఏడాదిలో విడుదల చేయాలనుకున్నాను. కాని అది కూడా సాధ్యం కాలేదు. అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ తో పాటు కరోనా వల్ల మరో ఆరు ఏడు నెలలు గ్యాప్‌ వచ్చింది. ఈ కారణాల వల్ల తన సినిమా ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చింది. నిశబ్దం సినిమా విడుదలైన తర్వాత ఈమె రెండు సినిమాలు చేయబోతుంది. ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tags:    

Similar News