జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డిన అనుష్క‌.. ఎలాగో తెలుసా?

Update: 2021-06-26 14:30 GMT
అమ్మాయిలు అంటేనే అందం.. అలాంటి అందానికి ఏదైనా డామేజ్ జ‌రిగిందంటే.. వాళ్లు ఏమాత్రం త‌ట్టుకోలేరు. తెగ ఫీలైపోతారు. ప్ర‌పంచం మొత్తం త‌ల‌కిందులైన‌ట్టు మ‌ద‌న‌ప‌డిపోతారు. అయితే.. మ‌హిళ‌లు ఫేస్ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఒక‌టి జుట్టు రాల‌డం. ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న‌వారికి కొద‌వే లేదు.

అయితే.. ఇదే స‌మ‌స్య‌ను బాలీవుడ్ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ కూడా ఎదుర్కొంది. ఇటీవ‌ల అనుష్క శ‌ర్మ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత నుంచి ఆమె జుట్టు ఊడిపోవ‌డం మొద‌లు పెట్టింద‌ట‌.

ఇది స‌హ‌జంగా చాలా మందిలో జ‌రిగే ప్ర‌క్రియ‌. హార్మోన‌ల్ బ్యాలెన్స్ లో తేడాలు రావ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌ని చెబుతారు నిపుణులు. మ‌ళ్లీ కుదురుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఇది జ‌ర‌గ‌డానికి స‌రైన పోష‌కాహారాల‌తో కూడిన భోజ‌నం కూడా చేయాలని చెబుతారు.

అయితే.. త‌న స‌మ‌స్య ప‌రిష్కారానికి వైద్యుల వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట అనుష్క‌. త‌న స‌హ‌న‌టి సోన‌మ్ క‌పూర్ ను ఆశ్ర‌యించింద‌ట‌. జుట్టు రాలిపోతోంద‌ని చెప్ప‌గా.. ‘జార్జ్ నార్త్ వుడ్‌’ అనే సెలూన్ కు వెళ్లమని చెప్పిందట. అక్కడికి వెళ్లడం.. అనుష్క హెయిర్ ఫాల్ తగ్గిపోవడం జరిగిందట.

దీంతో.. అనుష్క ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వివ‌రిస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిందీ బాలీవుడ్ బ్యూటీ. త‌న జుట్టురాలే స‌మ‌స్య‌ను ప‌ర‌ష్క‌రించిన హెయిర్ సెలూన్ కు, దాన్ని ప‌రిచ‌యం చేసిన సోన‌మ్ క‌పూర్ కు ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.
Tags:    

Similar News