పెళ్లికి ముందు స్వీటీ ప్లాన్ - బి!

Update: 2020-06-12 04:30 GMT
నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో న‌టించ‌డం త‌ప్ప స్వీటీ అనుష్క శెట్టికి వేరొక ఆప్ష‌న్ లేదా? అంటే అవున‌నే తాజా ప‌రిణామం చెబుతోంది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత అనుష్క ఎంపిక‌లు ప‌రిశీలిస్తే ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ వైపే మొగ్గు చూపుతోంది. జీరోసైజ్.. భాగ‌మ‌తి.. నిశ్శ‌బ్ధం .. ఇవ‌న్నీ ఈ త‌ర‌హానే.

పాన్ ఇండియా మూవీ `నిశ్శ‌బ్ధం` ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా క్రైసిస్ వేళ వీలుప‌డ‌లేదు. థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నార‌ని లేదూ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశార‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మ‌వుతోంది. ఆ సినిమా సంగ‌తి అటుంచితే స్వీటీ మ‌రోసారి లేడీ ఓరియెంటెడ్ కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. ఈసారి మిర్చి-భాగ‌మ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన యువి క్రియేష‌న్స్ తో స్వీటీ టై అప్ అవుతోంది.

`రా రా కృష్ణయ్య` ఫేం మహేష్.పి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అత‌డికి ఇది రెండో సినిమా. నాయికా ప్రాధాన్యం.. రొమాన్స్ జోన‌ర్ లో క‌థాంశాన్ని సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని యువి సంస్థ వెల్ల‌డించాల్సి ఉంది.

స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసే కంటే నాయికా ప్రాధాన్యం ఉన్న క‌థ‌ల్ని తెచ్చే యువ ద‌ర్శ‌కుల‌కే స్వీటీ అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తోంది. ఎలానూ స్వీటీ పెళ్లి విష‌య‌మై ఇంటిపోరు చాలా కాలంగా ఉండ‌నే ఉంది. అందుకే పెళ్లికి ముందే గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌కుండా ఇలా లేడీ ఓరియెంటెడ్ వైపే మొగ్గు చూపుతోంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Tags:    

Similar News