• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ ఇంటికి పవన్...

బన్నీ ఇంటికి పవన్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2017-07-16 04:22 GMT
గతేడాది సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ఈ ఏడాది డీజే-దువ్వాడ జగన్నాధం అంటూ ఆసక్తి కలిగించాడు. ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన డీజే.. చివరకు యావరేజ్ గా మిగిలింది. చాలా రోజుల తర్వాత తన సినిమాను హిట్ పట్టాలు ఎక్కించలేకపోయిన అల్లు అర్జున్..  ఇప్పుడు తన తర్వాతి మూవీపై దృష్టి పెట్టాడు.

టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు ఉన్న వక్కంతం వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ.. 'నా పేరు సూర్య' అనే టైటిల్ పై రూపొందనున్న మూవీలో నటిస్తున్నాడు బన్నీ. ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్.. నా ఇల్లు ఇండియా. ఈ ఇండియా ఇంటిలోకి ఇప్పుడు హీరోయిన్ అను ఇమాన్యుయేల్ వచ్చి చేరింది. ముందు నుంచి అనుకున్నట్లుగా పవన్ హీరోయిన్ కే ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. నానితో మజ్ను చేసిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

ఈ మలయాళీ కుట్టికి.. నా పేరు సూర్యలో ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. దేశభక్తి జోనర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో.. అను రోల్ కొత్తగా ఉంటుందని.. ప్రస్తుతం ఆ పాత్ర కోసం లుక్ విషయంలో దర్శకుడితో చర్చలు జరుపుతోందని అంటున్నారు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుండగా.. తొలి షెడ్యూల్ లోనే ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేసేస్తారట. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ మూవీల ప్రధాన పాత్రను పోషించనున్నాడు.
Tags:    
  • Anu Emmanuel 
  • Allu Arjun 
  • Naa Peru Surya Movie 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS