ఈ క్రైసిస్ అనూని అంత దెబ్బ కొట్టిందా?
కెరటంలా ఉవ్వెత్తున ఎగసి పడి అంత లోనే చప్పున చల్లారి పోయింది కేరళ కుట్టి అనూ ఇమ్మాన్యుయేల్. కెరీర్ ఆరంభం చోటా హీరోలతో నటించినా ఆ తర్వాత పవన్ .. బన్ని లాంటి స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం తో అనూ రేంజ్ ఎక్కడికో వెళ్లి పోతుందనే అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందమే అయ్యింది. ఇటీవల ఎవరూ అవకాశాలు ఇవ్వక పోవడం తో అటు తమిళ పరిశ్రమకు వెళ్లి పోయింది. అక్కడైనా కలిసొచ్చిందా? అంటే ఇంతవరకూ ఏ అప్ డేట్ లేనే లేదు.
తమిళంలో శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇచ్చినా ఆ తర్వాత ఛాన్స్ అన్నదే లేదు ఎందుకనో. ప్రస్తుతం తెలుగులో అల్లుడు అదుర్స్ అనే సినిమాకి సంతకం చేసిందని ప్రచారమైనా అసలు ఆ మూవీ ప్రచారం జాడ అయినా కనిపించలేదు. చారెడేసి కళ్లతో అంత మాయ చేసింది. యూత్ కంటికి కునుకే పట్టనీకుండా చేసింది. కానీ ఇంతలోనే ఏమైందో!
తాజా సన్నివేశం చూస్తుంటే.. అందాల అనూ ఇంక కనుమరుగవుతోందా..! ఏమో పరిశ్రమలో ఒకటే సందేహం వ్యక్తమవుతోంది. తమిళం నుంచి ఆఫర్స్ లేవు. తెలుగులో వస్తున్న ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది. దీంతో ఇప్పుడు కరోనా క్రైసిస్ చూస్తుంటే ఎవరికీ ఛాన్సుల్లేవ్. అందుకే ఈ క్లిష్ఠ సమయం లోనే అనూ దుకాణం సర్దేసే సన్నివేశం వచ్చేసింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఎలాంటి అప్ డేట్స్ తన నుంచి లేకపోవడంతోనే ఈ డౌట్.