• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ ఫ్యామిలీ...

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో!

By - Tupaki Desk
Update: 2022-09-20 04:08 GMT
టాలీవుడ్ తెరపై సూపర్ స్టార్ గా కృష్ణ ఒక తిరుగులేని ముద్ర వేశారు. అలనాటి సీనియర్ స్టార్ హీరోలలో సాహసిగా ఆయనకి పేరు. అందువల్లనే తెలుగు సినిమాకి సంబంధించిన అనేక మలుపులకు ఆయన కారణమయ్యారు.

అందువల్లనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేశ్ బాబు ఈ జనరేషన్ సూపర్ స్టార్ గా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే కృష్ణ అల్లుడుగా సుధీర్ బాబు కూడా తన ప్రత్యేకతను చాటుకోవడానికి  ప్రయత్నిస్తున్నాడు. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అతని పేరే శరణ్ కుమార్. ఇతను ఎవరో కాదు నరేశ్ అల్లుడు. 'మిస్టర్ కింగ్' అనే  టైటిల్ తో శరణ్ కుమార్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాతోనే హీరోగా ఆయన తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో, యశ్విక -  ఉర్వీ సింగ్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. సునీల్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

శరణ్ కుమార్ ఎవరనేది ఇండస్ట్రీలో చాలామందికి తెలియదు. ఇక ప్రేక్షకుల గురించి చెప్పవలసిన అవసరం లేదు. అందువలన శరణ్ పోస్టర్స్ చూసినవాళ్లంతా ఈ కుర్రాడు ఎవరు అనుకోవడం మొదలుపెట్టారు. అందువల్లనే  తాజాగా శరణ్ పై ఒక వీడియో చేసి వదిలారు.

'మిస్టర్ కింగ్' సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకునివెళ్లేలా ఆయన తనవంతు ప్రయత్నం చేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. మరి శరణ్ ఎంతవరకూ నిలదిక్కుకుంటాడనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • SuperStar 
  • Family 
  • Krishna 
  • MaheshBabu 
  • SudheerBabu 
  • Naresh 
  • SharanKumar 
  • Nepotism 
  • Tollywood 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS