బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్..

Update: 2021-09-01 23:30 GMT
టాలీవుడ్ అగ్రహీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. అగ్రహీరోలతో నటిస్తూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. అక్కినేని నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం' సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డె అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటోంది.

త్రివిక్రమ్ అస్థాన హీరోయిన్ గా పూజాహెగ్డే మారిపోయింది. 'అల వైకుంఠపురంలో' సినిమాలో నటించి మెప్పించింది. తెలుగునాట బుట్టబొమ్మగా మారింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తో ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం అఖిల్ తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అనే సినిమా చేస్తోంది.

ఇక ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి 'రాధేశ్యామ్'లోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ ఆచార్య మూవీలోనూ కీలక పాత్రలో నటించింది. తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తోంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. నెట్టింట్లో ఇప్పుడు సంబరాలు చేసుకుంటోంది.  ఈ మేరకు తను ఈ మైలురాయి చేరుకునేందుకు సహాయం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఒక వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇక తనను బాగా చూసుకున్న తన టీంను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది పూజా..


Full View
Tags:    

Similar News