• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ రీ ఎంట్రీ మూవీ...

పవన్‌ రీ ఎంట్రీ మూవీ గురించి మరో వార్త

By - Tupaki Desk
Update: 2019-12-11 06:25 GMT
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నిక ల్లో సత్తా  చూపలేక పోయాడు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుండి బయట పడేందుకు పవన్‌ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు ఓకే చెప్పాడంటూ చాలా రోజులుగా మీడియా లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'పింక్‌' రీమేక్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అఫిషియల్‌ గా ప్రకటన రాలేదు. కాని పవన్‌ రీ ఎంట్రీ కన్ఫర్మ్‌ అంటూ అంతా చాలా గట్టిగా చెబుతున్నారు.

పింక్‌ రీమేక్‌ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త  సోషల్‌ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పింక్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలను వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి తర్వాత మొదలు పెట్టేందుకు దిల్‌ రాజు ఏర్పాట్లు చేస్తున్నాడట. మొదట ఒక షెడ్యూల్‌ మొత్తం కూడా పవన్‌ కళ్యాణ్‌ లేకుండానే షూటింగ్‌ చేస్తారట. పవన్‌ లేకుండా ఉండే సీన్స్‌ చిత్రీకరణ అంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడు పవన్‌ రంగంలోకి దిగుతాడనే ప్రచారం జరుగుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్‌ ను మళ్లీ వెండి తెరపై చూస్తామా అంటూ వారు అంతా కూడా ఉత్సాహం తో ఉన్నారు. పింక్‌ రీమేక్‌ విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు హీరోయిన్‌ ఇతర పాత్రల విషయం లో కూడా క్లారిటీ రాలేదు. దిల్‌ రాజు నిర్మించబోతున్నాడు.. లీడ్‌ రోల్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నటించ బోతున్నాడు. ఈ రెండు తప్ప రీమేక్‌ కు సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు.


Tags:    
  • Pawan Kalyan 
  • Pspk26 
  • Pink Remake 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS