పీరియాడిక్ జానర్ వైపు మరో హీరో 1940ల కథతో..!

Update: 2021-04-06 03:30 GMT
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా.. ప్రస్తుతం హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. చేతిలో ఉన్నటువంటి ఒక్కో మూవీ కంప్లీట్ చేస్తూ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇటీవలే రానా ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "అరణ్య" విడుదల అయింది. తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన అరణ్య సినిమాను తెలుగు, తమిళ బాషలలో విడుదల చేశారు. కానీ ఈ సినిమా టాక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అరణ్య కోసం దాదాపు సంవత్సర కాలం వెయిట్ చేశారు కానీ లాభం లేకుండా పోయింది. అయితే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమా తుదిదశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన విరాటపర్వం టీజర్ సోషల్ మీడియాలోమంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం రానా గుట్టుచప్పుడు కాకుండా మరో పీరియడిక్ మూవీని ఓకే చేసాడని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. రానా తదుపరి సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తుంది. వెంకీ చెప్పిన డిఫరెంట్ స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రానా. ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. అయితే నూతన దర్శకుడుగా వెంకీ రానాతో 1940 కాలంలో జరిగే కథాంశంతో సినిమా తీయనున్నట్లు టాక్. ఆ సినిమాలో పీరియడిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. అయితే రానా ప్రస్తుతం విరాటపర్వంతో పాటు పవన్ కళ్యాణ్ తో 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు.
Tags:    

Similar News