• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో మూవీకి మరో...

స్టార్ హీరో మూవీకి మరో హీరో లిరిక్స్..??

By - Tupaki Desk
Update: 2021-03-02 23:30 GMT
ఈ ఏడాది 'మాస్టర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో దళపతి విజయ్. తమిళనాడు తప్ప దేశవ్యాప్తంగా యాభైశాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ.. మాస్టర్ 250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రిలీజైన పదహారు రోజుల నుండి మాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అయితే విజయ్ తదుపరి సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. దళపతి 65వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాలో దళపతి సరసన హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మిక మందనల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దళపతి సినిమాలో మరో తమిళ హీరో శివకార్తికేయన్ నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

మాస్టర్ సినిమాతో విజయ్ తో విజయ్ సేతుపతిని చూసిన ప్రేక్షకులు.. ఈసారి విజయ్ పక్కన అతని అభిమాని అయిన శివకార్తికేయన్ కనిపిస్తాడని పుకార్లు వెలువడ్డాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు సన్నిహితుడైన శివ.. నెల్సన్ ఫస్ట్ మూవీ 'కొలమావు కోకిల'లో 'కళ్యాణవయసు' సాంగ్ రాసాడు. అలాగే ఇప్పుడు నెల్సన్ దర్శకత్వంలో డాక్టర్ సినిమా చేస్తున్నాడు. మార్చ్ 26న విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలకు కూడా లిరిక్స్ రాసాడు శివ. అయితే ఇప్పుడు దళపతి 65వ సినిమాకు కూడా లిరిక్స్ అందిస్తాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ సంగీతం అందించనున్న దళపతి సినిమాలో శివకార్తికేయన్ ఏ విధంగా భాగస్వామ్యం అవుతాడో చూడాలి. మరి నిజంగానే లిరిక్స్ అందిస్తున్నాడా.. లేక ఇదంతా పాపులారిటీ కోసం రూమర్ క్రియేట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి దళపతి సినిమాలో శివ నటిస్తాడా.. లేక లిరిక్స్ మాత్రమే రాస్తాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Tags:    
  • Siva Karthikeyan 
  • Thalapathy Vijay 
  • Vijay65 
  • Kollywood 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS