కంగనపై ప్రముఖ గేయ రచయిత క్రిమినల్ కేసు
క్వీన్ కంగనను వరుస క్రిమినల్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతకుముందు శివసేన తరపున పలు క్రిమినల్ కేసులు దాఖలు కాగా.. ఇప్పుడు ప్రముఖ గేయరచయిత జావేద్ అక్తర్ కంగనా రనౌత్ పై తన అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముంబై అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆయన ఫిర్యాదు చేయడం సంచలనమైంది.
ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తన పరువు మర్యాదల్ని మంట కలిపే వ్యాఖ్యల్ని కంగన చేసిందని ఆయన ఆరోపించారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దానిపై లక్షల్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది తన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమేనంటూ జావేద్ తీవ్ర ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్ పై విచారించాలని అతడు కోర్టును కోరారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం కేసులోకి కంగన రనౌత్ తన పేరును అనవసరంగా లాగారని కూడా నివేదించారు. సదరు నటీమణి బాలీవుడ్ మాఫియా.. నటవారసత్వం స్వపక్షపాతానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతోంది. అదుపు అన్నదే లేకుండా సొంత సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి విధితమే.
బాలీవుడ్ లో స్వపక్షపాతం నటవారసుల చుట్టూ మాఫియా రింగ్ గురించి కూడా కంగన చానెల్ లైవ్ లోనే చెరిగేస్తోంది. తన ఆరోపణలను నిరూపించలేకపోతే పద్మశ్రీని తిరిగి ఇస్తానని చెప్పేంతవరకు కంగన వెళ్ళింది.
ఈ నేపథ్యంలోనే జావేద్ పేరును కంగన ప్రస్థావించడం వివాదాస్పదమైంది. కంగనపై ఆరోపణలకు సంబంధించి క్రిమినల్ కేసు ఫైల్ అయ్యిందా లేదా? అన్నదానికి ఇంకా క్లారిటీగా తేలాల్సి ఉంది. అయితే కంగనా రనౌత్ పై ఐపిసి సెక్షన్ 499.. 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేయాలని అక్తర్ కోరారు. ఈ కేసు మొదటి విచారణ 2020 డిసెంబర్ 3 న జరగాల్సి ఉంది. కానీ క్వీన్ అప్పటికి స్థానికంగా అందుబాటులో లేరు. మనాలిలోని సొంత నివాసంలో ఉండడంతో విచారణ కుదరలేదట.