సమంత ముఖంలో ఆ స్పెషల్ గ్లోకి కారణం ఇదేనా?
తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటోలు చూస్తే, ఆమె ఫేస్ లో కనిపిస్తున్న ప్రత్యేకమైన ఆనందం, సహజమైన గ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం జీవితంలో ఎంతో ఆనందమైన దశను ఆస్వాదిస్తోంది. తాను తల్లి కాబోతున్నానని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటోలు చూస్తే, ఆమె ఫేస్ లో కనిపిస్తున్న ప్రత్యేకమైన ఆనందం, సహజమైన గ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా సమంత తన భర్త రాజ్ తో కలిసి కనిపించారు. ఈ ఫోటోల్లో బ్లాక్ కలర్ ఎలిగెంట్ అవుట్‌ఫిట్‌లో సమంత ఎంతో అందంగా కనిపించింది. ప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళల ముఖంలో కనిపించే ప్రత్యేకమైన మెరుపు ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించిన సమంత ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది.
రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న సమంత, ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. డెలివరీ తర్వాత మళ్లీ ఆమె నటిగా బిజీ కానుంది. అయితే ఈ గ్యాప్ లో కథలను విని మంచి కథలేమైనా ఉంటే తన బ్యానర్‌లో నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ తాజా ఫోటోలు చూస్తే... మామ్ టు బీ గ్లో అంటే ఇదేనేమో అనిపించేలా సమంత మరింత అందంగా మెరిసిపోతోంది. ఆమె కొత్త ప్రయాణం కూడా ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.