ఇకపై ఆ పేరుతో పిలవొద్దు.. అభిమానులకు అన్నా కొణిదెల స్పెషల్ రిక్వెస్ట్!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ కు దారితీసింది.

Update: 2026-07-28 06:17 GMT

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ కు దారితీసింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి వరుసగా ప‌ర్స‌న‌ల్ మెమొరీస్, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటూ వస్తున్న ఆమె, ఈసారి తన పేరుకు సంబంధించిన అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వడం విశేషంగా మారింది. చాలాకాలంగా తనను అన్నాలెజినోవా అనే పిలుస్తున్నార‌ని, కానీ పెళ్లి చేసుకున్న రోజు నుంచే తాను అన్నా కొణిదెల అనే పేరును తీసుకున్నాన‌ని, త‌న భ‌ర్త ఇంటి పేరుతోనే త‌న‌ను పిల‌వాల‌ని, మొద‌టి సారి త‌న పేరుపై రియాక్ట్ అవుతూ, ఇకపై తనను అన్నా కొణిదెల గానే సంబోధించాలని ఆమె కోరారు.



 


తన పేరుకు సంబంధించిన ఈ విష‌యాన్ని వెల్లడించడానికి ఓ స్పెష‌ల్ రీజ‌న్ ఉందని కూడా అన్నా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచే ఈ విషయం చెప్పాలని అనుకున్నప్పటికీ, సరైన సిట్యుయేష‌న్ కోసం వెయిట్ చేశాన‌ని, త‌న బ‌ర్త్ డే ద‌గ్గ‌ర ప‌డుతున్నందున‌ ఈ విషయాన్ని వెల్లడించడం సముచితంగా భావించినట్లు ఆమె చెప్పడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.



 


పెళ్లి తర్వాత తన భర్త ఇంటిపేరును అధికారికంగా స్వీకరించిన విషయాన్ని గుర్తుచేసిన అన్నా, ప్రజల్లో మాత్రం ఇప్పటికీ పాత పేరే ఎక్కువగా వినిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే ఇకపై తన ప్రస్తుత అధికారిక పేరునే ఉపయోగించాలని మీడియా, ఫ్యాన్స్, సోషల్ మీడియా వినియోగదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి పేరులోనే అతని లేదా ఆమె వ్యక్తిగత గుర్తింపు, ఆత్మీయత, అనుబంధం ప్రతిబింబిస్తాయని ఆమె వ్యాఖ్యానించడం ఈ పోస్టుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

అన్నా కొణిదెల నా పేరు.. అదే నేను అనే భావాన్ని వ్యక్తపరిచేలా చేసిన ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. పేరును కేవలం పిలుపుగా కాకుండా, వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించిన అన్నా అభిప్రాయానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఆ పోస్ట్ కు ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా ఇకపై ఆమెను అన్నా కొణిదెల గానే సంబోధిస్తామని కామెంట్లు చేస్తూ, ఆమె డెసిష‌న్ ను, పేరు ప‌ట్ల త‌న‌కున్న క్లారిటీని స్వాగతిస్తున్నారు.

ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి విదేశీ పర్యటన సందర్భంగా దిగిన ఓ అరుదైన ఫొటోను కూడా అన్నా పంచుకున్నారు. ఆ ప‌ర్స‌న‌ల్ మెమొరీని ఫ్యాన్స్ తో షేర్ చేయడంతో పోస్టుకు మరింత ఆదరణ లభించింది. పోస్ట్ చేసిన‌ కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు రావడం ద్వారా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన చిన్న అంశాన్ని కూడా ఎంతో హుందాగా, ఎమోష‌న్ తో వెల్లడించిన అన్నా కొణిదెల పోస్ట్ ప్రస్తుతం అభిమానులతో పాటు సాధారణ నెటిజన్ల మధ్య కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పేరు వెనుక ఉన్న ఎమోష‌న్ ను గుర్తుచేస్తూ, తనను ఎలా సంబోధించాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయడం ఈ పోస్టు ప్రత్యేకతగా నిలిచింది.

Tags:    

Similar News