మహేష్ - నమ్రత దంపతులకు క్రిష్మస్ గూడీస్ పంపిన పవన్ - అన్నా లెజ్నెవా..!

Update: 2020-12-23 16:48 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయేమో కానీ పవన్ - మహేష్ మాత్రం ఒకరిపట్ల ఒకరు ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. ఇటీవల ఇద్దరి బర్త్ డే లకు ఒకరికొకరు విషెస్ చెప్పుకొని ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి వారి మధ్య అనుబంధాన్ని తెలియజెప్పే విషయం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా దంపతులు క్రిష్మస్ పండుగను పురస్కరించుకుని గూడీస్ ను పంపించి మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు.

'రుచికరమైన క్రిస్మస్ గూడీస్ పంపినదుకు పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజ్నెవా లకు కృతజ్ఞతలు' అని పోస్ట్ పెట్టిన నమ్రత దీనికి ఓ ఫోటోని జత చేసింది. ఇందులో క్రిస్మస్ డెకార్ తో పాటు చాక్లెట్లతో కూడిన బహుమతులు కనిపిస్తున్నాయి. ఇది చూసిన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల పరంగా పవన్ - మహేష్ ల మధ్య పోటీతత్వం ఉందని ఫ్యాన్స్ అంటున్నా.. ఒకరి పట్ల ఒకరు అపారమైన గౌరవం కలిగియున్నారని ఇలాంటివి చూస్తే తెలుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ని ముందుగా రాంగ్ గా ట్యాగ్ చేసిన నమ్రత.. ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్ళీ 'అన్నా' మరియు 'పీకే' కి థ్యాంక్స్ అని పోస్ట్ చేసింది. ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇలాంటి స్నేహపూర్వక అనుబంధం ఉండటం మెచుకోదగ్గ విషయమనే చెప్పాలి.
Tags:    

Similar News