హీరోయిన్ అంజలిః పవన్ అలా చేసేసరికి..
'అంజలి..' టాలీవుడ్లో హీరోయిన్ మొదలు ఐటమ్ గర్ల్ దాకా.. లేడీ ఓరియంటెడ్ నుంచి స్పెషల్ క్యారెక్టర్ దాకా.. అన్నితరహా పాత్రల్లోనూ నటించింది. అప్ కమింగ్ చిత్రం 'వకీల్ సాబ్'లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు.
సినిమా అవకాశాలు తనకు ఎప్పుడూ దూరం కాలేదని, ఇప్పటికీ రేసులో ఉన్నానని ప్రకటించారు అంజలి. సౌత్ లో ఇప్పటి వరకూ 48 చిత్రాల్లో నటించానని చెప్పిన అమ్మడు.. ప్రస్తుతం ఐదు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయని వెల్లడించారు. వకీల్ సాబ్ గురించి మాట్లాడుతూ. ఈ సినిమాలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు.
ఇక, పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ.. ఆయనతో కలిసి 15రోజులకు పైనే షూటింగ్ లో పాల్గొన్నట్టు చెప్పారు. కానీ.. పవన్ తో మాట్లాడడానికి తనకు 15 రోజుల సమయం పట్టిందని అన్నారు. ఆయన సెట్లోకి వచ్చారంటే మొత్తం నిశ్శబ్ధ వాతావరణం నెలకొనేదని గుర్తు చేసుకున్నారు.
పవన్ తో కలిసి సాగిన తన ప్రయాణం కెరీర్ లోనే అద్భుతమైనదని చెప్పారు. ఇక, ఈ సినిమాలో కోర్టు సీన్ పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ చప్పట్టు కొట్టి తనను అభినందించారని చెప్పారు అంజలి.పవన్ అలా మెచ్చుకోవడంతో గాల్లో తేలిపోయినట్టు అనిపించిందన్నారు. ఆ ప్రశంసలు తాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.