'రామారావు గారు'.. బాలయ్యే కరెక్ట్

Update: 2016-01-28 17:30 GMT
రామారావు గారు.. ఈ టైటిల్ కి టాలీవుడ్ లో ఎవరు సరిపోతారు? ఈ ప్రశ్నకు ఎవరైనా ఇవ్వాల్సిన ఆన్సర్ నందమూరి నటసింహం బాలయ్య పేరే. పేరులోనే పవర్ ఉన్న ఆ టైటిల్ ని.. జస్టిఫై చేయగల ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే. నందమూరి తారక రామారావు కొడుకుగా.. రామారావు అనే పేరుకు తగ్గట్లుగా కనిపించగల నటుడు బాలయ్యే.

అసలింతకీ ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. కళ్యాణ్ రామ్ తో పటాస్ తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ టైటిల్ తో బాలయ్య దగ్గరికి వచ్చాడు. సబ్జెక్ట్ సంగతి ఇంకా బైటకి చెప్పకపోయినా, ఈ టైటిల్ ని సాధారణమైన స్టోరీలకు వాడే అవకాశం అయితే లేదు. 'రామారావు గారు' పేరుతో బాలయ్యతో ఓ సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేయాలన్నది ఈ డైరెక్టర్ ఆళోచన. అయితే.. ఇప్పుడు బాలయ్య ఆదిత్య 999ని స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు. ఇది పూర్తయితే కానీ మరో ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం లేదు. ఇది కనీసం ఏడాదైనా పడుతుందని తెలుస్తోంది.

ఎంత టైం పట్టినా 'రామారావు గారు' టైటిల్ పై చేసే మూవీని బాలయ్యతోనే  చేయాలన్నది అనిల్ రావిపూడి ఆలోచన. ఇప్పటికైతే బాలకృష్ణ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ.. ఒక్క టైటిల్ తోనే బాలయ్య అభిమానుల్లో ఆసక్తి కలిగించడంలో మాత్రం ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. వీలైనంత త్వరగా రామారావు గారిగా బాలకృష్ణను చూడాలని ఉత్సాహ పడిపోతున్నారు ఫ్యాన్స్.
Tags:    

Similar News