సుమ ఫోటో చూపిస్తే.. ‘అతడు నా కొడుకు’ అంటూ స్వీటీ సంచలనం

Update: 2020-03-19 04:12 GMT
భాగమతి సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్న అనుష్క అలియాస్ స్వీటీ తాజాగా చేసిన చిత్రం నిశ్శబ్దం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ రెండున ఈ చిత్రం విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరవుతోంది అనుష్క. మామూలుగా ఇంటర్వ్యూలు ఇవ్వటానికి పెద్దగా ఇష్టపడని అనుష్క.. తాజాగా మాత్రం పలు మీడియా సంస్థలకు విపరీతంగా టైం ఇచ్చేస్తూ.. ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీంతో.. ఆమెకు సంబంధించిన వార్తలు.. విశేషాలు..పేజీలకు పేజీలుగా పబ్లిష్ అవుతున్నాయి.

తాజాగా పలు షోలలో కూడా అనుష్క సందడి చేస్తున్నారు. తాజాగా ఒక చానల్ లో ప్రసారమయ్యే షోకు హాజరయ్యారు. షోకు యాంకర్ గా వ్యవహరించే సుమ.. కార్యక్రమంలో భాగంగా ఒక ఫోటోను చూపించిన వెంటనే.. అతను.. నా కొడుకు అంటూ స్వీటీ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఇంతకూ సుమ చూపించిన ఫోటో.. ప్రభాస్ ది. అదేంటి? అంటూ సుమ అడిగితే.. అంతే.. నా కొడుకే కదా? అంటూ స్వీటీ ఆన్సర్ ఇవ్వటం సంచలనంగా మారింది.

మీ ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి కదా? అని సుమ అడిగితే.. కొడుకు కదా? అంటూ సుమకే పంచ్ వేసింది అనుష్క. సరే.. కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండన్న సుమ మాటలకు బదులిచ్చిన అనుష్క.. అందుకే కదా ఈయన కొడుకు అయ్యాడంటూ వేసిన సెటైర్ తో సుమకు మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. తన మాటలతో తన షోకు వచ్చే వారికి పంచ్ లు మీద పంచ్ లు వేసే అలవాటున్న సుమకు.. స్వీటీతో మాత్రం భిన్నమైన అనుభవం ఎదురైందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా అనుష్క చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News