అనుష్క ఉండాల్సిన జైల్లో టాప్ యాంకర్

Update: 2017-02-25 06:04 GMT
రాజమౌళి అంటేనే క్రియేటివిటీ. పిచ్చి పీక్స్ లోకి తీసుకెళ్ళడం ఆయనకు షరా మామూలే. అయితే ఇప్పుడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. జాగారం ఉండే వారి కోసం లేట్ నైట్ బాహుబలి ఇంటర్యూలు కొన్ని టివిల్లో వదిలారు. వీటిలో కూడా ఆయన క్రియేటివిటీతో చాలా ఆకట్టుకున్నారు. అదే బాగా కిక్కిచ్చింది.

రాజమౌళిని ఇంటర్యూ చేయడానికి మాహిష్మితి సామ్రాజ్యంలో అడుగుపెట్టింది యాంకర్ సుమ. అదేనండీ రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ కు వెళ్ళింది. ఇక మాహిష్మతిని పరిచయం చేస్తున్న సుమ.. సడన్ గా మాయం అయిపోయి.. దేవసేన అనుష్కను భల్లాలదేవుడు ఉంచిన జైల్లో పడిపోయింది. అక్కడ నుండి బయటకు తీయమని అటుగా వచ్చిన రాజమౌళిని వేడుకుంటే.. ఆయనేమో.. మా ఆడియో ఫంక్షన్ లాంచ్ చేయడానికి మీ డేట్ కన్ఫామ్ చేసి.. రెమ్యూనరేషన్ తీసుకోకుండా హోస్టింగ్ చేయడానికి ఒప్పుకుంటేనే.. బయటకు రప్పిస్తా అన్నాడు. పాపం సుమ.. వెంటనే ఒప్పేసుకుంది.. జైల్లో నుండి బయటకు వచ్చింది. తిరిగి రాజమౌళిని ఇంటర్యూ చేయడానికి సన్నద్దమైంది.

ఏదో సింపుల్ గా ఇంటర్యూ చేస్తే అందులో కిక్కేముంటుంది.. అందుకే ఇలా సుమతో జైల్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు జక్కన్న. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ!!
Full View

Tags:    

Similar News