• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మా ఆయన అంటూ అనసూయ...

మా ఆయన అంటూ అనసూయ ఫైరింగ్!

By - Tupaki Desk
Update: 2022-06-12 12:31 GMT
బుల్లితెరకి గ్లామర్ ను నేర్పిన యాంకర్ అనసూయ. అలాగే టీవీ వాళ్లు సినిమాల్లో ఎక్కువ కాలం నిలబడలేరనేది టాక్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టింది అనసూయ. అనసూయ ఒక వైపున బుల్లితెరపై కొనసాగుతూనే మరో వైపున సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలనుకుంది. టీవీ షూటింగులకి అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆ తరువాత సాంగ్ తో పాటు చిన్న పాత్ర కూడా ఉండాలంటూ ఒక షరతు పెట్టింది. అక్కడి నుంచి అనసూయ కెరియర్ మరింత ఊపందుకుంది.

 ఇప్పుడు చాలా సినిమాల్లో ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. ఆయా సినిమాల్లో ముఖ్యమైన .. కీలకమైన  పాత్రలను పోషిస్తూ, తనని దృష్టిలో పెట్టుకుని పాత్రలను క్రియేట్ చేసే స్థాయికి ఆమె వెళ్లిపోయింది. ఈ ఏడాదిలో ప్రేక్షకుల  ముందుకు రావడానికి ఆమె సినిమాలు చాలానే లైన్లో ఉన్నాయి. అయినప్పటికీ తనకి ఇంతటి నేమూ ఫేము తీసుకొచ్చిన ' జబర్దస్త్' ను మాత్రం ఆమె వదిలిపెట్టడం లేదు. ఈ కామెడీ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'జబర్దస్త్' స్కిట్ లో భాగంగా పరదేశి 'సెలబ్రిటీ హోమ్ టూర్' ను ప్లాన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ కోసం అతను అనసూయ ఇంటికి వెళతాడు. అనసూయ పాత్రలో నైటీలో కనిపించిన రైజింగ్ రాజు గొల్లున నవ్విస్తాడు. తన వేషంలో ఉన్న రైజింగ్ రాజును చూసి అనసూయ కూడా నవ్వుకుంటుంది. అయితే అనసూయ పాత్రలో ఉన్న రైజింగ్ రాజు, 'భరద్వాజ్ అంటూ పిలుస్తాడు. అది అనసూయ భర్త పేరు. ఆయన పాత్రలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ  'దొరబాబు' ఎంట్రీ ఇస్తాడు.

ఆయనను చూడగానే అనసూయ రుసరుసలాడిపోతుంది. రాముడిలాంటి మా ఆయన పాత్రలో దొరబాబును పెడతారా అని ఫైర్ అవుతుంది. స్కిట్ ఆపకపోతే షో వైలెంట్ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది. దొరబాబు కాస్త రొమాంటిక్ అనే వార్త అప్పట్లో షికారు చేయడం .. తరచూ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ హైపర్ ఆది ఆటపట్టించడం జరుగుతూ వచ్చింది. అందువలన అనసూయ అలా ఫైర్ అయ్యుండొచ్చు. అలా కావడం వెనుక రేటింగ్ సూత్రం కూడా ఉండి ఉండొచ్చు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే క్లారిటీ వచ్చేస్తుంది.          
Tags:    
  • Anchor Anasuya 
  • Jabardasth 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS