• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యూయార్క్ మేయ‌ర్ తో...

న్యూయార్క్ మేయ‌ర్ తో అన‌సూయ‌ త‌గ్గేదేలే!

By - Tupaki Desk
Update: 2022-10-11 04:51 GMT
అమెరికాలో తెలుగు వారి 'తానా' ఉత్స‌వాలు అంబ‌రాన్నంటాయి. న్యూయార్క్ #Timesquare వద్ద బ‌తుక‌మ్మ పండ‌గ ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించారు తెలుగు ప్ర‌జ‌లు. ఈ ఉత్స‌వాల‌కు న్యూయార్క్ మేయ‌ర్ ముఖ్య అతిథిగా విచ్చేయ‌గా.. యాంక‌ర్ అన‌సూయ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అన‌సూయ‌తో పాటు గాయ‌ని మంగ్లీ ఈ ఉత్స‌వాల్లో ఉన్నారు. సాంప్ర‌దాయ చీర‌క‌ట్టు ర‌వికెలో చ‌క్క‌న‌మ్మ‌లు ఎంతో అందంగా మురిపెంగా క‌నిపించారు.

ఇక మేయ‌ర్ తో క‌లిసి అన‌సూయ బ‌త‌క‌మ్మ సంబ‌రాల్ని కొన‌సాగించ‌డం కొస‌మెరుపు. మేయ‌ర్ తో చాలా సేపు మంత‌నాలు సాగించారు. అంతేకాదు త‌న‌తో క‌లిసి సెల్ఫీలు దిగారు. ఇటీవ‌లే పాపుల‌రైన పుష్ప సిగ్నేచ‌ర్ ఎక్స్ ప్రెష‌న్ ని ఏకంగా మేయ‌ర్ తోనే న‌టింపజేసింది అన‌సూయ‌. త‌గ్గేదేలే!! అంటూ మేయ‌ర్ ఆయ‌న అనుయాయులు అన‌సూయ‌కు జ‌త కలిసారు.

ఈ సంద‌ర్భంగా అన‌సూయ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. "ఎంతటి గౌరవప్రదమైన సంఘటనలతో కూడిన సమయం !! బతుకమ్మ పండగ న్యూయార్క్ నగరంలో!! #తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విజయవంతమైన 'బంగారు బతుకమ్మ' వేడుకలను తెలంగాణ ఆడపడుచుగా నిర్వహించడం చాలా గర్వంగా భావిస్తున్నాను" అని ఆనందం వ్య‌క్తం చేసారు.

@nycmayor సార్ @nycmayorsoffice ఇది జరగడానికి అనుమతించినందుకు .. ఇంత ఆరాధ్య వ్యక్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు! @dilipchauhanny సార్ కి ధన్యవాదాలు!!ఈ ఈవెంట్ లో నన్ను ప్రాతినిధ్యం వహించాలని భావించిన @peoplemediafactory విశ్వప్రసాద్ సర్ కి ధన్యవాదాలు..
ధన్యవాదాలు .. అంటూ ప్ర‌తి ఒక్క‌రినీ ట్యాగ్ చేస్తూ అన‌సూయ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

#తానాలోని మీ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పలేను. ముఖ్యంగా అందమైన మహిళలందరికీ!!! నాకు అద్భుతమైన సమయమిది!! అంటూ హార్ట్ ఈమోజీల‌ను అన‌సూయ షేర్ చేసారు.

అమెరికా వీధుల్లో షికార్లే షికార్లు..!అనసూయ తరచుగా సోషల్ మీడియాలో తన అద్భుతమైన ఫోటోషూట్ లు..షేర్ చేస్తుంది. ఇవి కళ్లకు ట్రీట్ గా ఉంటాయి. తాజా ప‌ర్య‌టన నుంచి ఇంత‌కుముందు కొన్ని ఫోటోలు రివీల‌య్యాయి.  వీటిలో త‌న‌ అద్భుతమైన కామిక్ టైమింగ్ ఆక‌ట్టుకుంది. ఆమె తన ఫన్నీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ప్ర‌తిసారీ అల‌రిస్తూనే ఉంది.

ఇంత‌కుముందు న్యూయార్క్ నుంచి షార్ట్ లో క‌నిపించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి నేను సూర్యుడిని నాతో తీసుకొచ్చాను అని చమత్కారమైన క్యాప్షన్ ని ఇచ్చింది అన‌సూయ‌. ఇంత‌లోనే ఆ ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.  

ప్రకాశవంతమైన ఎండ లో విదేశీ వీధుల్లో అనేక బబ్లీ భంగిమలతో అన‌సూయ క‌నిపించింది.  జెట్-బ్లాక్ డెనిమ్ షార్ట్ తో నలుపు-తెలుపు ఉన్ని దుస్తుల‌ను ధరించి అనసూయ ఎంతో అందంగా కనిపించింది. అలాగే విదేశీ వీధుల్లో క్లాసీ పెయిర్ బ్లాక్ సన్ గ్లాసెస్ తో చుట్టేసింది.

అనసూయ ఫోటోలను వీక్షించాక‌ పొగడ్తలతో ముంచెత్తడానికి వ్యాఖ్యల విభాగంలో అభిమానులు ఏమాత్రం సంశ‌యించ‌లేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అక్కా అని ఒక అభిమాని విలాసంగా చెప్పాడు. అనసూయ ట్రావెల్ డైరీలు అసూయపడేలా ఉన్నాయి అని నెటిజనులు వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    
  • AnchorAnasuyaBharadwaj 
  • NewYork 
  • Mayor 
  • TimeSquare 
  • America 
  • Dilipchauhanny 
  • Event 
  • BathukammaCelebrations 
  • Movienews 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS