గ్లామర్ వేసి రెసిపీ వండుతున్నావా..? యాంకర్ పై ఫ్యాన్స్
తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ గ్లామరస్ బ్యూటీ బుల్లితెర పైనే కాదు ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. టీవీ సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన అనసూయ.. ఎల్లప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక తాజాగా తన ఫాలోవర్స్ డిమాండ్ మేరకు తన ఇంట్లో ఒక కొత్త రెసఫీని తయారు చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా ద్వారా పోస్ట్ చేసింది. "హాయ్ చెప్పి అభిమానుల కోరిక మేరకే ఈ సడన్ రెసిపీ తయారు చేస్తున్నానని తెలిపింది.
అంతేగాక రెసిపీకి సంబంధించి ఓ వీడియో పెట్టింది. ఇంకా రెసిపీ తయారీ పూర్తి వీడియో కోసం తన యూట్యూబ్ ఛానల్ లో సాయంత్రం 6 గంటలకు పోస్ట్ చేస్తానని తెలిపింది. ఇక ఫ్యాన్స్ అందరూ వీడియో కోసం సిద్దంగా ఉండాలని.. చేసిన రెసిపీ ఎలా ఉందో నాకే తెలియట్లేదు.. కానీ ఈవెనింగ్ వరకు వెయిట్ తప్పదు." అంటూ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ పై గ్లామర్ వేసి వండుతున్నావా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రలు కూడా చేస్తుంది. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వం లో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.Full View
అంతేగాక రెసిపీకి సంబంధించి ఓ వీడియో పెట్టింది. ఇంకా రెసిపీ తయారీ పూర్తి వీడియో కోసం తన యూట్యూబ్ ఛానల్ లో సాయంత్రం 6 గంటలకు పోస్ట్ చేస్తానని తెలిపింది. ఇక ఫ్యాన్స్ అందరూ వీడియో కోసం సిద్దంగా ఉండాలని.. చేసిన రెసిపీ ఎలా ఉందో నాకే తెలియట్లేదు.. కానీ ఈవెనింగ్ వరకు వెయిట్ తప్పదు." అంటూ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ పై గ్లామర్ వేసి వండుతున్నావా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రలు కూడా చేస్తుంది. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వం లో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.