• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సినిమాలు.. నిర్మాతలు...

నాని సినిమాలు.. నిర్మాతలు ఎందుకు మారుతున్నారు?

| టాలీవుడ్‌ నేచురల్ స్టార్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే.

By - M Prashanth
Update: 2026-02-24 23:30 GMT

టాలీవుడ్‌ నేచురల్ స్టార్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. కథ, దర్శకుడు, టెక్నీషియన్స్ విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే నాని.. ఇప్పుడు నిర్మాతల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా రీసెంట్ గా రెండు సినిమాలకు గాను చివరి నిమిషంలో నిర్మాతలు మారడం ఆసక్తికరంగా మారింది.

కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆ బ్యానర్‌ పైనే ప్రారంభమయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆ సంస్థ తప్పుకుని, నిర్మాతగా వెంకట్ బోయనపల్లి ఎంట్రీ ఇచ్చారు. చివరికి ఆయన నిర్మాణంలోనే సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయం కూడా సాధించింది.

అప్పుడు అది నార్మల్ గా ప్రొడ్యూసర్ ఛేంజ్ అయ్యి ఉంటారని అంతా భావించారు. కానీ ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి రావడంతో అందరి దృష్టి నానిపై పడింది. ప్రస్తుతం నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా బ్లడీ రోమియో. ఆ సినిమాను మొదట డీవీవీ దానయ్య నిర్మిస్తారని అధికారిక ప్రకటన వచ్చింది. ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయ్యారు.

కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. బ్లడీ రోమియో ప్రాజెక్ట్ కూడా ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి చేతులకు వెళ్లింది. దీంతో వరుసగా రెండోసారి నాని సినిమా నిర్మాత మారడం హాట్ టాపిక్‌ గా మారింది. చివరి నిమిషంలో ఇలా మార్పులు ఎందుకు? అనే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే నాని తన సినిమాల విషయంలో పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ కోరుకుంటారని ఎప్పుడూ టాక్ వినిపిస్తోంది.

బడ్జెట్, ప్లానింగ్, షూటింగ్ షెడ్యూల్స్ వంటి అంశాల్లో తనకు కంఫర్ట్‌ గా అనిపించే నిర్మాతలతోనే ముందుకు వెళ్లాలని చూస్తారని అంతా చెబుతుంటారు. ముఖ్యంగా వెంకట్ బోయనపల్లితో మంచి అనుబంధం ఉండటంతో మళ్లీ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్ కూల్ గా ముందుకు వెళ్లడానికి నమ్మకం చాలా ముఖ్యం.

ఆ నమ్మకం ఉన్న నిర్మాతతో పని చేయడమే నాని లక్ష్యం అని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రొడ్యూసర్ల విషయంలో మార్పులు జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా నిర్మాతల మార్పు వార్తలతో నాని కొత్త సినిమా బ్లడీ రోమియోపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.

Tags:    
  • nani 
  • bloodyromeo 
  • shyamsingharoy 
  • tollywood 
  • producerchange 
  • venkatboyanapalli 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS