• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖంగుతిని జబర్దస్త్ స్టేజి...

ఖంగుతిని జబర్దస్త్ స్టేజి దిగిన అనసూయ.. పబ్లిసిటీ స్టంటేనా..?

By - Tupaki Desk
Update: 2021-06-26 10:30 GMT
తెలుగు పాపులర్ గ్లామరస్ టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్.. టీవీ షోలలో ఎంత అందంగా ముస్తాబు అవుతుందో అదే రేంజిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. తాజాగా జబర్దస్త్ షోలో కొత్తగా వచ్చిన గెస్ట్ అనసూయకు ఖంగు తినే ప్రశ్నలు వేసాడు. అదికూడా మాములు షాక్ కాదు ఏకంగా అనసూయ సెట్ వదిలిపోయేలా చేసాడు. అనసూయ జబర్దస్త్ లో ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తుందో తెలిసిందే. కాస్త గ్లామర్ టచ్ ఉండే విధంగా.. అంటే కనీసం షో తన అందం చూసైనా జనాలకు చేరే విధంగా ముస్తాబు అవుతుంది. అయితే ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న నడి వయస్కురాలు కాబట్టి ఇంకా కాలేజీ అమ్మాయిలా పొట్టి పొట్టి డ్రెసెస్ ధరించడం పై ఎల్లప్పుడూ కామెంట్స్ ఫేస్ చేస్తూనే ఉంటుంది.

అదిగాక ఇది నా పర్సనల్ అంటూ విమర్శకులకు షాకిస్తుంది. కానీ తాజాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో మాత్రం అనసూయకే దిమ్మతిరిగే ప్రశ్నలు గుప్పించాడు గెస్ట్ యూట్యూబ్ శివ. అక్కడినుండి అనసూయ స్టేజి దిగి బయటికి వెళ్ళబోయింది. ఇంతలో ఏమైందో అనే టెన్షన్ ప్రేక్షకులలో.. ఇది ఈ వారం ఈటీవీ వారు ప్లే చేసిన ప్లాన్. అసలు టీవీ ఛానల్స్ వారు ప్రమోషన్స్ కోసం షోను జనాల్లోకి తీసుకెళ్లడానికి వీలైన్నన్ని ఎక్కువ జిమ్మిక్కులు ప్రయోగిస్తుంటారు. ఇటీవలే యాంకర్ అనసూయ ద్వారా జబర్దస్త్ యాజమాన్యానికి చాలా ప్లస్ అయింది. అనసూయ ఎల్లప్పుడూ నా పర్సనల్ నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ ట్రోల్స్ ఫేస్ చేస్తుంది.

తాజాగా జబర్దస్త్ షో రీసెంట్ ప్రోమో ద్వారా ఈటీవీకి భారీ ప్రమోషన్స్ జరిగాయి. యాంకర్ శివ గెస్ట్ గా వచ్చి నాకెప్పటి నుండో ఓ ప్రశ్న అడగాలని ఉంది అని స్టార్ట్ చేసాడు. అనసూయ గారు మీరు ఎందుకు ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు? ఇది బయట టాక్ అని అడిగేసాడు. దానికి సమాధానంగా అనసూయ.. బయటవాళ్లు అన్నారంటే వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు.. కానీ మీరు ఇక్కడే ఉంటారు.. మీరు అడగడం ఏంటి? ఇది నా పర్సనల్" అని చెప్పింది. మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు? అని యాంకర్ శివ కౌంటర్ వేశాడు. ఆ దెబ్బకు ఖంగుతిన్న అనసూయ "ఏంటి ఇది ఎవరెవరినో తీసుకొచ్చి.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి? అని" స్టేజ్ దిగి సెట్ బయటకు వెళ్ళింది.

జబర్దస్త్ ప్రోమో చూసేసరికి ప్రేక్షకులలో అసలేం జరిగింది అంటూ క్యూరియసిటీ పెరిగిపోయింది. కానీ కాసేపటికి అనసూయ మళ్లీ నవ్వుతూ స్టేజ్ మీద కనిపించేసరికి ఇదంతా ప్రమోషనల్ ప్లానే అంటున్నారు. ఈ విధంగా పబ్లిక్ స్టంట్స్ చేస్తూ టీవీ ఛానల్స్ పాపులర్ అవుతున్నాయి. కానీ ఎడిటర్స్ కి ఎక్కువగా క్రెడిట్ ఇవ్వాలంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    
  • Anasuya 
  • Jabardasth 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS