చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయంట

Update: 2018-06-18 05:46 GMT
టాలీవుడ్ లో స్పెషల్ పాత్రలకు సంబంధించి కొంత మంది నటి నటులకు మంచి గుర్తింపు అందుతోంది. ఆ విషయంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అయితే టాప్ లో ఉన్నారని చెప్పాలి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా కనిపించి అందరి మనసులను దోచేసుకున్న అనసూయకి ఇప్పుడు బడా సినిమాల్లో కూడా అవకాశం అందుతోంది. అవకాశాలు ఎక్కువవుతుండడంతో యాంకర్ గారు కొంచెం పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇటీవల అనసూయ కి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా దాదాపు పది ఆఫర్లు వచ్చాయట. కానీ అనసూయ తన పాత్రకు సినిమాలో కాస్త ఇంపార్టెన్స్ ఉంటే తప్ప ఒకే చేయడం లేదని టాక్ వస్తోంది. ఇప్పటికైతే ఈ బ్యూటీ మూడు సినిమాలకు సైన్ చేసిందట. ఇక మరికొన్ని ఆఫర్స్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ యాంకర్ గారు చాలా బిజీ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.

ఇక ఇటీవల అమ్మడు చికాగోకు సంబందించిన క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా స్పందించారు. గతంలో కొందరు ప్రవాసులు తనకు ఫోన్ చేశారని వారి మాటలు తేడాగా అనిపించడంతో వెంటనే నో చెప్పీసినట్లు అనసూయ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే అమెరికాలో షాకిచ్చిన సెక్స్ రాకెట్ కేసు విషయంలో కూడా అనసూయ స్టేట్మెంట్లు కీలకం అయిన సంగతి తెలిసిందే. సదరు రాకెట్ నిర్వాహకుడు ఆమెతో చీప్ గా మాట్లాడినట్లు ఒక వార్తాపత్రికకు ఆమె తెలిపింది.


Tags:    

Similar News